పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం
మెట్ పల్లి జులై 10 (ప్రజా మంటలు)
రైతులు నాట్లు వేసే ప్రస్తుత ముమ్మర దశలో పొలం బాట కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది రైతులను పంట పొలాల్లోనే కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
గురువారం ఉదయం గుండంపల్లి గ్రామం సందర్శించిన సందర్భంగా మెటుపల్లి ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూదన్ మాట్లాడుతూ రైతులు ట్రాన్స్ఫార్మర్ లపై ఫ్యూజ్ లు పోయినపుడు సంబంధిత సిబ్బందికి సమాచారం అందిస్తే సరిచేస్తారని, కానీ తమకు తాముగా వేసుకొనే ప్రయత్నం చేసి ప్రమాదాల బారిన పడవద్దని హితవు పలికారు. ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయితే అదనపు ట్రాన్స్ఫార్మర్లు అందిస్తామని, వదులుగా యుండి వేలాడే తీగల మధ్య అంతర స్తంభాలు వేస్తామని, కొత్త కనెక్షన్లు సత్వరంగా జారీ చేస్తామని తెలిపారు. మోటారు కు ఐరన్ బాక్స్ స్థానంలో ఫైబర్ బాక్స్ అమర్చుకోవాలని, వన్యప్రాణుల నుండి పంటల రక్షణకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయవద్దని, ఇళ్లల్లో బట్టలు ఆరవేసుకునేందుకు జీఐ వైరు ఉపయోగించరాదని సూచించారు.
జగిత్యాల జిల్లా లో విద్యుత్ ప్రమాదాలను రాబోయే నెలరోజుల్లో జీరో స్థాయికి తగ్గించడానికి ప్రతీ అధికారి, సిబ్బంది నిబద్ధతతో కృషి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఇంచార్జి ఏడీఈ మనోహర్, రాఘవపేట ఏఈ సంతోష్, రైతు నాయకులు నర్సయ్య, లక్ష్మారెడ్డి, రాజేందర్ సిబ్బంది సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి
