రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్
ఉజ్జయిని అమ్మవారికి అత్తిలి ఫ్యామిలీ మొదటి బోనం సమర్పణ
బోనం ఎత్తిన గాయని మధుప్రియ, ఊరేగింపులో ఆడిన జోగిని శ్యామల
సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు) :
బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతనే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఓల్డ్ బోయగూడ లోని వారి నివాసం నుండి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలిబోనం మహంకాళి అమ్మవారికి సమర్పించారు.
బోనం కు పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జోగిని శ్యామల కు బోనం ఎత్తారు. శ్యామల బోనంను ఎత్తుకొని డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో ఊరేగింపుగా వెళ్ళి సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆషాడ మాసం ప్రారంభమైతే బోనాల ఉత్సవాలతో జంట నగరాల్లో ఎంతో సందడి, కోలాహలంగా ఉంటుందని చెప్పారు.
గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభమై బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర, ఓల్డ్ సిటీ బోనాలతో ముగుస్తాయని చెప్పారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశం తో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకే కాకుండా ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 13 వ తేదీన నిర్వహించే మహంకాళి అమ్మవారి జాతర, 14 వ తేదీన రంగం, అంబారీ పై అమ్మవారి ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపు కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, లక్షలాది మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
