ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం
ఉద్యమకారుల ఐక్యం కావాలి - ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం.
సికింద్రాబాద్ జూలై 03 (ప్రజా మంటలు):
ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని గుర్తించి న్యాయం చేయాలని జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు.
గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశం జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు దీనస్థితిలో ఉన్నారని వారికి మార్గం చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
తెగించి కొట్లాడటానికి రోడ్డుమీదికి వచ్చి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకొని కేసులు ఉన్న ఉద్యమకారులను మొదటగా గుర్తించాలని సూచించారు. ఉద్యమ సమయంలో ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు. నాకోసం మీకోసం కాకుండా ఉద్యమకారులంతా ఐక్యం అయి ముందుకు వస్తే సీఎం దగ్గరికి తీసుకెళ్లి ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో రామగిరి ప్రకాశ్, రుద్ర శంకర్, ప్రపూల్ రామ్ రెడ్డి, మాంచాల వెంకటస్వామి, కుమారస్వామి, గోవర్ధన్,వశపాక నరసింహ, అంబు రాథోడ్, మోహన్ బైరాగి, ప్రసాద్, చాపర్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
