6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ
సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు):
బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదురుకోలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. మూడు రోజుల ఉత్సవాలకు దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి సేవలో తరించారని పేర్కొన్నారు. అందులో 4 లక్షల మందికి పైగా అమ్మవారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించిందన్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ నుంచి ఈ ఉత్సవాల నిర్వహణకు డిప్యూటేషన్ పై దాదాపు 70 మంది అధికారులు వచ్చారని తెలిపారు. మరోవైపు GHMC నుంచి శానిటేషన్, వివిధ పనుల నిమిత్తం 100 మందికి పైగా సిబ్బందిని నియమించామని తెలిపారు. ఇంకోవైపు 1,000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. 170 మంది సిబ్బందితో వాటర్ వర్క్స్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి 50 మంది, ఫైర్ అండ్ సేఫ్టీ నుంచి 10 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు.
మరోవైపు 1500 మంది స్వచ్ఛందంగా వాలంటీర్లుగా వ్యవహారించారని, 150 మందికి పైగా అన్నదాన కార్యక్రమాలు, 10 మందికి పైగా మెడికల్ క్యాంపులు నిర్వహించారని తెలిపారు. ఈ ఏడాది జోగినులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నామని చెప్పారు. అమ్మవారి కళ్యాణం, బోనం సమర్పణ విషయంలో జోగినిలకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 14,783 లడ్డూలు, 2,513 వడ, 14,147 పులిహోర ప్యాకెట్ల విక్రయాలు జరిగాయన్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఈసారి ఉచితంగా ప్రసాదం పంపిణీ చేశామన్నారు. ఎక్కడ కూడా ప్రోటోకాల్ సమస్యలు తలెత్తలేదని తెలిపారు.
ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 13 మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. వారంతా రాత్రింబవళ్ళు కష్టపడి ఉత్సవాలను విజయవంతం చేశారని పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసిన జీహెచ్‌ఎంసీ, విద్యుత్, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్‌బీ, వాటర్ వర్క్స్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులను అభినందించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, భక్తులకు సేవలు చేసిన వలంటీర్లను మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదం లేకుండా ఇదంతా సాధ్యం కాదన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
