ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత
జగిత్యాల జూలై 3(ప్రజా మంటలు )
స్థానిక జగిత్యాల సాయినగర్ కి చెందిన శ్రీమతి మామిడాల చంద్రకళ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిపిస్తూ వచ్చింది , కానీ ఇప్పుడు తన ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోవడంతో ఇంజనీరింగ్ చదువుతున్న తన కూతురు వెన్నెల కాలేజ్ ఫీ కట్టలేక చదువు కొనసాగించలేని పరిస్థితి వచ్చింది.
ఆర్థికంగా వెనకబడటంతో ఇళ్ళు గడవడమే కష్టంగా మారిన పరిస్థితిలో వారు మన సత్యసాయి సంస్థ ను ఆశ్రయించటం జరిగింది. అమ్మాయి చదువు కొనసాగించే విధంగా సహాయం చేయమని కోరడం జరిగింది.
భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ద్వారా భక్తులందరు స్పందించి అమ్మాయి ఇంజినీరింగ్ కాలేజీ ఫీజు కి కావలసిన 40,000 రూపాయల నగదు ఈ రోజు సత్యసాయి మందిరంలో వారికి అందచేయడం జరిగింది
భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఈ అమ్మాయిపై మరియు వారి కుటుంబంపై అలాగే సహకరించిన భక్తులందరిపై నిండుగా ఉండాలని , స్వామి వారు ఇంట వెంట జంట కంట వుండి నిరంతరం కాపాడాలని మనసారా ప్రార్తిస్తున్నాం.
కార్యక్రమంలో సంస్థ తరపున కన్వీనర్ బట్టు రాజేందర్ , చిటుమల్ల లక్ష్మీనారాయణ , అర్వపెల్లి ఆనంద్ , ఎన్నాకుల అశోక్ , వంగల లక్ష్మీనారాయణ, గుండ అర్చన లు పాల్గొనడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
