పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్
సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) :
పాశమైలారం ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ - సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిదంబరం షణ్ముఖానాథన్, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజ్ సిన్హా, సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బిరామి రెడ్డి, రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోదాన్ పై హత్య గా పరిగణింపబడని (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ) కేసు నమోదు చెయ్యాలంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని మంగళవారం పిటీషన్ దాఖలు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.25లక్షల- చొప్పున పరిహారం చెల్లించే విధంగా సిగాచి యాజమాన్యాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది కోరారు. గాయపడ్డ కార్మికులకు రూ10లక్షల - చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. రాష్ట్ర కార్మికులు, ఉపాధి కల్పన, కర్మాగారాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ను ప్రతివాదిగా పేర్కొన్న రామా రావు - తెలంగాణ వ్యాప్తంగా కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వమంటూ కోరారు. తన పిటిషన్ ను విచారణకు స్వీకరించి డి సంఖ్య 15315/IN/2025 గా జాతీయ మానవ హక్కుల కమిషన్ నమోదు చేసిందని - త్వరలో విచారణకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని అడ్వకేట్ రామారావు పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
