తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ ఆటో యూనియన్ విలీనం
ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జూన్ 23:
తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ’ తెలంగాణ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విలీనమయ్యింది. ఆదివారం బంజారాహిల్స్ లోని నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. యూనిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ సలీం, ప్రధాన కార్యదర్శి సయీద్ రహ్మత్ అలీ హష్మీ సహా యూనియన్ నాయకులందరూ తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్ లోనే అతిపెద్ద ఆటో యూనియన్ తెలంగాణ జాగృతిలో విలీనం కావడం సంతోషకరమని.. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఆటోడ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోలకు థర్డ్ పాటీ ఇన్సూరెన్స్ చెల్లించడానికి ఒక్కో డ్రైవర్ పై రూ.8 వేల ఆర్థిక భారం పడుతోందని, దానిని రద్దు చేసి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మోటర్ వెహికిల్ యాక్ట్ వల్ల ఆటోడ్రైవర్లపై భారం పడకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటోడ్రైవర్లకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ను రూ.10 లక్షలకు పెంచాలని, ఈఎస్ఐ హాస్పిటళ్లలో ఆటోడ్రైవర్లకు వైద్య సేవలు అందించాలని కోరారు. ట్యాక్సీ ప్లేట్ వెహికిల్స్ ను మాత్రమే ఓలా, ఉబర్, ర్యాపిడో ద్వారా అనుమతించాలని సూచించారు. ఆటోడ్రైవర్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. కార్మిక విభాగం నాయకుడు రూప్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ నాయకులు అమ్జద్, అస్లాం, అజీం, బాబు, ఖాలిద్, నవీన్, శివ, బషీర్, అజీం, భగవాన్, మహబూబ్, రవి, ముబీన్ తదితరులు పాల్గొన్నారు.
జాగృతి విద్యార్థి విభాగంలో ఎన్ఎస్ యూఐ నాయకుల చేరిక
తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ లో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు చెందిన ఎన్ఎస్ యూఐ నాయకులు సహా పలువురు విద్యార్థులు చేరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు ఎమ్మెల్సీ కవితకు ఖడ్గం బహూకరించారు. కార్యక్రమంలో రాముయాదవ్, అభి గౌడ్, అఖిల్ స్వామి, అనికేత్ సాయి, అనిల్, చెన్న కేశవ, సాయి, సాయి కుమార్ నాయి, లడ్డు, లక్కీ రుద్ర, మహేశ్, మణికంఠ, నాగబాబు, ప్రణయ్, ప్రశాంత్, రుద్ర అభి, షేక్ ఆరిఫ్, సుదీప్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన గ్రామ కుల సంఘాల పెద్దలు

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా
