ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించాలి

- రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు

On
ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించాలి

ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలి

- జూలై నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టుకోవాలి

- ఆయిల్ పామ్ పంట విస్తరణ కు కట్టుదిట్టమైన చర్యలు*

- రాబోయే మూడున్నర సంవత్సరాలలో శాచురేషన్ పద్దతిలో నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

- శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను వెంటనే ఇతర భవనాలకు తరలించాలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, హౌసింగ్, పంచాయతీ రాజ్, పని తీరు పై సమీక్ష 

కరీంనగర్ జూన్ 22 (ప్రజా మంటలు):

IMG_20250622_203732

ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలనీ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఆదివారం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, హౌసింగ్ తదితర శాఖల పని తీరు  పై రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్) హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీ హర్ష, సందీప్ కుమార్ ఝ, సత్య ప్రసాద్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరెందర్ రెడ్డి, ఎమ్మెల్యే లు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,   డాక్టర్ సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్య నారాయణ, గంగుల కమలాకర్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వర్షా భావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత,  రైతు భరోసా,  ఆయిల్ పామ్ సాగు,  ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ జరిగిన ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, బడి బాట, మధ్యాహ్న భోజనం, తదితర అంశాల ను  ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వారీగా సంబంధిత జిల్లా కలెక్టర్ లు వివరించారు. 

ఈ సందర్భంగా *మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,*  గత ఏడాదిన్నర కాలంగా గత పాలకుల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేస్తున్నామని అన్నారు.  రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను సరి చేస్తూ ఆర్థికపరమైన వెసులుబాటు చేసుకొని పాలన సాగిస్తున్నామని అన్నారు. 

IMG-20250622-WA0023

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా పని చేయాలని అన్నారు.  ప్రజలకు మేలైన పాలన అందించాలని, ఎక్కడా ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా పాలన చేయాలని అన్నారు. 

జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ జిల్లాలో అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.  యూరియా వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తక్కువ సరఫరా చేస్తుందని, అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని, అధికంగా వాడటం వల్ల భూ సారం తగ్గిపోతుందని, భూమికి నష్టం జరుగుతుందని, దీని పై రైతులకు రెగ్యులర్ గా అవగాహన కల్పించాలని అన్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయిల్ పామ్ సాగు పై మరింత శ్రద్ద వహించాలని అన్నారు. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు మించి ఆయిల్ పామ్ విస్తరణ చేపట్టాలని అన్నారు.  ఆయిల్ పామ్ పంట చేతికి వచ్చిన రైతుల అనుభవాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేయాలని అన్నారు.

హార్టికల్చర్ అధికారులతో పాటు వ్యవసాయ  శాఖలోని ఏ.ఈ.ఓ, ఏ.ఓ లు కూడా లక్ష్యాలు నిర్దేశించుకోని పని చేయాలని మంత్రి ఆదేశించారు.
నగరం పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు పెద్ద ఎత్తున చేయాలని మంత్రి తెలిపారు.

విద్యా శాఖ పట్ల జిల్లా కలెక్టర్ లు శ్రద్ధ వహించాలని, ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్య అందాలని,  ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు పెంచాలని, మన ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న మార్కులను ప్రజలకు వివరించాలని మంత్రి ఆదేశించారు.

IMG-20250622-WA0023

 జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్&బీ శాఖ, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించాలని, ఎక్కడైనా శిథిలావస్తలో పాఠశాలలు ఉంటే వెంటనే అక్కడి నుంచి తరలించాలని, వర్షా కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించవద్దని అన్నారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సహాకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని, గతంలో జరిగిన అస్త్యవ్యస్థ పాలన ను సరిదిద్దాల్సిన అవసరం ప్రస్తుతం మన పై ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రివ్యూ లకు జిల్లా అధికారులు మాత్రమే ఆహ్వానించాలని, కింది స్థాయిలో ఫీల్డ్ అధికారులను డిస్టర్బ్ చేయవద్దని అన్నారు. 

జిల్లాల పరిధి తగ్గిపోయిందని కలెక్టర్లు మరింత క్షేత్ర స్థాయిలో పనిచేసే అవకాశం లభించిందని దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, పాలనపై దృష్టి సారించి మంచి ఫలితాలను సాధించాలని అన్నారు.

*ఐటి పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ,*  రాబోయే 3.5 సంవత్సరాల వ్యవధిలో సాచురేషన్ పద్దతిలో నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్ లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీ లో ద్వారా స్క్రూటినీ చేయించి, అర్హులైన నిరు పేదలైతే పార్టీలకతీతంగా తప్పనిసరిగా మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  వరికంటే రెండింతల ఆదాయం వచ్చే పంటలను రైతులకు సూచించాలని,  రైతులను ఒప్పిస్తూ కూరగాయల పంట విస్తరణ చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు.

విద్యా, వైద్యం, వ్యవసాయం ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.  ఉపాధ్యాయులకు అవసరమైన బోధన శిక్షణ కూడా అందించడం జరుగుతుందని అన్నారు. IMG-20250622-WA0026

బడి బాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గోన్నాలని, ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల కల్పన పట్ల స్థానిక ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలో రివ్యూ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 
కరీంనగర్ లో ఉన్న జ్యోతి బా పూలే  గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి అక్కడ పరిస్థితుల పై నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. 

**మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,*  9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  రైతులు పూర్తిస్థాయిలో కాకపోయినా తమకు ఉన్న పొలంలో కొంతమేర వరి నుంచి ఆయిల్ పామ్ వంటి పంటలకు విస్తరించాలని అన్నారు. మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటల ద్వారా ఆదాయం వస్తుందని, పెద్ద రైతులను గుర్తించి వారిచే ముందు కన్వెర్ట్ చేయాలని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గుంట భూమి కూడా పడావు పడకుండా వ్యవసాయ సాగు జరగాలని అన్నారు.  వరి మాత్రమే కాకుండా క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ పంటలను  పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అన్నారు. 

బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని అన్నారు.  విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తుల మొదటి రోజులోనే పంపిణీ చేయాలని అన్నారు.  రాజకీయాల కతీతంగా గ్రామం మొత్తం ఐక్యంగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలని, ఎక్కడ అనర్హులకు ఇండ్లు రావద్దని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నామని, పేదలకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల  రుణాలు అందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా చూస్తున్నామని అన్నారు. 
 
**ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,*  మొదటి ఏడాది 62 వేల కోట్ల రూపాయల రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు.  ఎరువుల కొరత ఎక్కడా లేదని, ప్రతి మండలం వద్ద అవసరమైన స్టాక్ అందుబాటులో పెడ్తున్నామని అన్నారు.  రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని, రైతు భరోసా నిధులు కూడా రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయని అన్నారు. 

వేములవాడ లో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణ పురం ప్రాజెక్టు అవసరమైన భూ సేకరణ చేసేందుకు నిధులు విడుదల చేయాలని అన్నారు. 

*కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ,*  భారత దేశం అవసరాల కోసం పెద్ద ఎత్తున ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణ ప్రోత్సహించడం చాలా మంచి పరిణామమని అన్నారు. 

ప్రతి రైతుకు వరి పంట సాగు చేయడం వల్ల సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆయిల్ పామ్ పంటతో ఎంత ఆదాయం వస్తుందో స్పష్టంగా తేడా తెలిసేలా అధికారులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. తాను వేసిన 48 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట నేడు చాలా బాగా దిగుబడి వస్తుందని ‌ అన్నారు.ఆయిల్ పామ్ సాగు కట్టింగ్ కు నైపుణ్య శిక్షణ పెంచాలని, ఆయిల్ పామ్ కంపెనీలను స్థానికంగా చిగురు మామిడిలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. 

 కరీంనగర్లో  గతంలో సీఎం స్పెషల్ ఫండ్ క్రింద 350 కోట్ల నిధులతో 120 రోడ్ల నిర్మాణ పనులు స్టార్ట్ చేశామని, గత ఏడాదిన్నర కాలంగా ఆ పనులు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జి మంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రోడ్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ వ్యవస్థ పని తీరు పర్యవేక్షించాలని అన్నారు. 

*జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,*. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల జిల్లాలో అధిక మొత్తంలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఆయిల్ ఫామ్ పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు. 

**కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,*  ఇందిరమ్మ ఇండ్లను పేదలకు త్వరితగతిన మంజూరు చేయాలని అన్నారు.  విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు.  మెట్టపల్లి హై స్కూల్ శిథిలావస్థలో ఉందని, పక్కన ఉన్న జూనియర్ కళాశాల భవనం 80% పూర్తయిందని, దానిని వేగవంతంగా పూర్తి చేసి ఈ పిల్లలను ఆ భవనానికి తరలించాలని అన్నారు. 
మెట్టపల్లి ప్రాంతంలో ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని కోరారు.

**పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ,*   రైతులకు వ్యవసాయ సాగు పై గ్రామాలలో సదస్సులు పెట్టి అవసరమైన సలహాలు, సూచనలు ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పించామని అన్నారు.  పంట మార్పిడి విధానం పట్ల విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.  గత 5 సంవత్సరాల కాలంలో చాలా మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిపోతుందని, వరి సాగు విపరీతంగా పెరుగుతుందని అన్నారు. 

గ్రామాలలో శాస్త్రవేత్తలను పంపి రైతులను చైతన్యవంతం చేయాలని, వివిధ రకాల పంటల సాగు, భూ సారం పెంచడం, తప్పుడు పద్దతుల వల్ల కలిగే నష్టాల పట్ల రెగ్యులర్ గా అవగాహన కల్పించాలని అన్నారు. 

**రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ,* తమ ప్రాంతంలో చేపట్టిన ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం వల్ల అంతర్గం పాలకుర్తి మండలాలు తొలిసారి సాగునీరు వచ్చిందని అన్నారు. గతం కంటే రైతులకు రెండింతల పంట పండిస్తున్నారని, పూర్తి స్థాయిలో గానే మద్దతు ధరతో కొనుగోలు చేశామని, రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ జరిగిందని అన్నారు. 

విద్యారంగంలో మంచి అభివృద్ధి పెద్దపల్లి జిల్లాలో జరుగుతుందని, పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన , నూతన ఉపాధ్యాయుల నియామకం జరిగిందని అన్నారు.  సింగరేణి ప్రాంతంలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ పై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అన్నారు.  సింగరేణి, ఎన్టిపిసి, ఆర్.ఎఫ్.సి.ఎల్ , కేశోరాం సిమెంట్ వంటి సంస్థల డి.ఎం.ఎఫ్.టి నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు.

సింగరేణి, ఎన్టిపిసి యాజమాన్యాల ద్వారా రామగుండం మంథని ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు మౌలిక వస్తువుల కల్పన, అదనపు ఉపాధ్యాయుల ఏర్పాటు చేయాలని అన్నారు. 

*మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ,*   పాఠశాలలోని విద్యార్థులకు చదవడం రాయడం, సామాన్య గణితం వంటి విద్యా ప్రమాణాలు వచ్చే విధంగా చూడాలని అన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా యువతను ప్రయోజకులను చేసేందుకు తమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ని స్థాపిస్తున్న విషయం గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యలో బడి మానేసిన పిల్లలకు దృష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.

**చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,* 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేయడం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.  శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రింద నారాయణ పురం రిజర్వాయర్ క్రింద 43 కోట్లు భూ సేకరణ కోసం పెండింగ్ ఉందని, వీటిని  విడుదల చేస్తే  చొప్పదండి, వేములవాడ ప్రాంతానికి ఉపయోగపడుతుందని అన్నారు.

చొప్పదండి ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని,  గంగాధర మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతనంగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. నాణ్యతతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలలో అందేలా చూడాలని అన్నారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –  అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం...
Read More...
Local News  State News 

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి   పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర...
Read More...
Crime  State News 

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు): జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు...
Read More...
Local News 

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్      

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్       జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
National  Comment  State News 

సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?

 సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన? న్యూఢిల్లీ  మార్చ్ 05: భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత...
Read More...
Local News 

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత  శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు  బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము
Read More...
Local News 

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా  పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్...
Read More...
State News 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు....
Read More...
State News 

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల...
Read More...
Local News 

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత    జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు)  పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్  అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ . శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.    హోళీ సందర్భంగా...
Read More...
National  International  

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు): పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు. AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International...
Read More...