స్టీల్ కంపెనీలో రూ 46 లక్షల చోరి - ఆరు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు
సికింద్రాబాద్, జూన్ 22 (ప్రజామంటలు):
ఓ కంపనీలో జరిగిన రూ.46లక్షల నగదు చోరీ కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించారు. సదరు సంస్థ మాజీ ఉద్యోగి తాను పనిచేసిన పాత సంస్థకే టోకరా వేసి ఏకంగా లాకరు నుంచి రూ.46లక్షలు దొంగిలించి డబ్బులతో పరారీ అవుతుండగా పోలీసుల అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.46.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ సికింద్రాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డ ప్రాంతంలో గిరీష్ జైన్ సన్ స్టీల్ పేరుతో స్టీల్ కంపనీ నిర్వహిస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి కంపనీలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి లాకర్ లో ఉన్న రూ.48లక్షలు దొంగిలించి పారిపోయాడు.ఈ విషయాన్ని మరుసటి రోజు గుర్తించిన కంపనీ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ జైన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు అందుకున్న బేగంపేట పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, చోరీకి పాల్పడిన వ్యక్తి ఆ కంపనీ మాజీ ఉద్యోగి గిరిధారి సింగ్(28)గా గుర్తించారు. మధ్య ప్రదేశ్ పురేలీ ప్రాంతానికి చెందిన గిరిధారి సింగ్(28) ఈ కంపనీలో మూడేళ్ల పాటు పనిచేశాడు. అయితే అతను పనిచేసిన సమయంలో డబ్బులు లాకర్ లో భద్రపరిచే పనులు సైతం చేసేవాడు. కాగా అతని ప్రవర్తన నచ్చకపోవడంతో కంపనీ యజమాని గిరీష్ జైన్ ఆరు నెలల క్రితం అతనిని పనిలో నుంచి తీసేశాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న గిరిధారి సింగ్ ఈనెల 20 అర్దరాత్రి పాటిగడ్డలోని స్టీల్ కంపనీకి వచ్చాడు. కంపనీ గోడ చాలా చిన్నదిగా ఉండటంతో గోడ ఎక్కి లోపలికి ప్రవేశించాడు. గోద్రెజ్ లాకర్ ని బ్రేక్ చేసి అందులో ఉన్న రూ.46 లక్షలు చోరీ చేశాడు . అ డబ్బులతో అదే రోజు రాత్రి సికింద్రాబాద్ కు చేరుకున్న గిరిధారిసింగ్ ఆదిలాబాద్ మీదుగా మధ్య ప్రదేశ్ పురేలీ వెళ్లేందుకు బస్సులో బయలు దేరాడు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 30 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు బస్సులో మధ్య ప్రదేశ్ వెళుతున్నట్లు ఆర్టీసీ బస్పును జీపీఎస్ ద్వారా ట్రాక్ చేశారు.
నిందితున్ని ఆదిలాబాద్ పోలీసుల సహాకారంతో మహారాష్ర్ద బార్డర్ లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్, బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి, బేగంపేట ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
