ప్రత్యేక రాష్ర్ట ఆశయాలు నెరవేరడం లేదు..
తెలంగాణ రాష్ర్టీయ లోక్ దళ్ పార్టీ ప్రెసిడెంట్ కపిలవాయి దిలీప్
సికింద్రాబాద్, జూన్ 20 (ప్రజా మంటలు)::
ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఆశయాలు, లక్ష్యాలు నెరవేరడం లేదని, ప్రత్యేక రాష్ర్టం వస్తే తమ కష్టాలు పోతాయనుకున్న ప్రజల ఆశలపై ప్రభుత్వాలు నీళ్ళు చల్లుతున్నాయని తెలంగాణ రాష్ర్టీయ లోక్ దళ్(టీఆర్ఎల్డీ) ప్రెసిడెంట్ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు.
శుక్రవారం కవాడిగూడ లోని టీఆర్ఎల్డీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర చట్టం ప్రకారం నిరుపేద ఎస్సీ,ఎస్టీ,బీసీ పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇయ్యాల్సిన 25 శాతం సీట్లను రాష్ర్ట ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తే 9లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుందన్నారు. ఈనెల 23న ఇందిరాపార్కు వద్ద ఈ అంశంపై దీక్ష చేపడుతున్నామని, దీక్షకు అన్ని పక్షాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఎంతో ఆర్బాటంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే ప్రారంభించి, నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ స్కీం కు సిబిల్ స్కోర్ లింకు పెట్టవద్దన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు ప్రతి ఏటా నష్టపోతున్నారని, వీరికి ఎకరానికి రూ25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణ సోయి లేని మంత్రులను , కమిషన్ తీసుకొని బిల్లులు మంజూరీ ఇస్తున్న మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టీయ లోక్ దళ్ మహిళా విభాగం జాతీయ అద్యక్షురాలు కపిలవాయి ఇందిరా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన అమరుల కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.కోటి పరిహారం,ఉద్యోగం, ఫించన్,భూమి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఉద్యమకారులను మరిచిపోవడం ప్రభుత్వాలకు తగదన్నారు.
ఉద్యమ పాటలతో ప్రజల్లో గూస్బంప్స్ ను తెప్పించిన విమలక్క, మధుప్రియ, వందేమాతరం శ్రీనివాస్ లను మరిచిపోవడం సరికాదన్నారు. కీరవాణి, మంగ్లీ లను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సినిమాలను కాదని, స్మగ్లింగ్ ను ప్రేరేపించే సినిమాలకు అవార్డులు ఇవ్వడం విచారకరమన్నారు. సమావేశంలో నాయకులు కిన్నెర సిద్దార్థ, శాంతి,కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి,అజాజ్ అహ్మాద్, విశాల్,మల్లేశ్,రంగయ్య లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు
