ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల.)
సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్ర మైన ధర్మపురిలో, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, ఆది వారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన ఆది వారం, ఉదయాత్ పూర్వం నుండి, దేవస్థానంలోని ప్రధానాలయాలలో, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నరసింహ మూల విరాట్టులకు, ప్రత్యేక పూజలు గావించారు.
మహా సంకల్పం, కలశ, గణపతి, విశ్వక్సేన, షోడశో పచార పూజలు, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, అభిషేకం, వస్త్రం, అలంకరణం, హరిద్రం, కుంకుమ, సుగంధ ద్రవ్యం, ధూపం, దీపం, నైవేద్యం, తదనంతరం ఏక, ద్వయ, త్రయ, పంచ, నాగ, నక్షత్ర, కుంభ హారతులు, మంత్ర పుష్పం, ఇత్యాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక దైవాల జయంతి సందర్భంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు, రామాయణ, భారత, భాగవ పురాణ పారాయణాలు, నారసింహ శతక పద్యాలు, సంగీతం, సంకీర్తన యుక్త అవధారములు, సనాతన క్రమంలో నిర్వహించారు.
రాష్ట్రంలోనే గాక నారసింహ క్షేత్రాల్లో వేరే ఎక్కడా లేనివిధంగా, ఛిత్తి, శిక్ష, బ్రహ్మ, భృగు, నారాయణం, సున్నాల పన్నం మొదలైన పంచ ఉపనిషత్తులతో పూజించి, స్వామి వారిని అభిషేకించడం, ధర్మపురి క్షేత్రంలో మాత్రమే అనాదిగా ఆచరిస్తున్న నేపథ్యంలో, అర్చకులు వేదవిదులైన పండితులు, నరసింహుని ఉపనిషత్తులతో పంచ సూక్తములతో అభిషేకాలు, సహస్ర నామ అర్చనలు, భజనలు, కీర్తనలతో, వైభవంగా జయంతి వేడుకలను నిర్వహించారు. దేవస్థానం ఏ సి ఈ ఓ సంకటాల శ్రీనివాస్, మార్గదర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్ పర్యవేక్షణలో, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నరసింహ మూర్తి, రమణాచార్య, కిరణ్, విజయ్, వంశీ, అశ్విన్, బొజ్జ సంతోష్, బొజ్జ సంపత్, బొజ్జ రాజగోపాల్ శర్మ, నంబి అరుణ్ తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించ బడగా, భక్త్యా వేశాలతో చేసిన భజనలు మైకుల ద్వారా క్షేత్రంలో ప్రతిధ్వనించి, ఆనందాన్ని కలుగజేసాయి. అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక టిక్కెట్లు తీసుకుని పూజాదులలో పాల్గొన్నారు.
మంత్రి, విప్ పూజలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ నారసింహ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. లక్ష్మీ నారసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు అర్చకులు, మంత్రి రాజ నరసింహ, లక్ష్మణ్ కుమార్ కు వైదికాశీస్సులు అందజేశారు.
ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నరసింహ నవరాత్రి ఉత్సవ వేడుకలలో ప్రధాన మరియు ముగింపు ఘట్టమైన నరసింహ స్తంభోద్భవ పూజాదికాలను ఆది వారం రాత్రి నిర్వహించారు. సంధ్యా సమయాన ప్రారంభించి, రాత్రి వరకు కొనసాగిన ప్రత్యేక స్తంభోద్భవ కాల విశేష పూజలను, వైదిక మంత్రాలతో, చతుర్వేద ఘోషలతో, అఖండ వైభవంగా, విధి విధాన వేదోక్త సాంప్రదాయ పద్ధతిలో కొనసాగించారు. దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల మండలి సభ్యులు,
సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆధ్వర్యంలో. ప్రధానాలయ ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్య, రమణ, కిరణ్, వంశీ, మూర్తి, విజయ్ తదితరులు ప్రధానాలయంలో అలంకృత స్థంభానికి, ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు. వివిధ హారతులు, మంత్రపుష్పం. అవధార యుక్త పూజలు గావించారు. పురాణ, వేద పక నాలు గావించారు. ఆస్థాన వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ నామ సంకీర్తన భజనలు చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల ప్రదర్శనలు
