అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు.
జగిత్యాల ఏప్రిల్ 6 ( ప్రజా మంటలు)
పట్టణంలోని విద్యానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి. ప్రత్యేకంగా అలంకరించిన మండపాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించినారు. మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆసీనులు చేసి అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణాన్ని మధ్యాహ్నం 12.20 ని.లకు. నిర్వహించగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు .
ఈ కళ్యాణాన్ని ఆలయ అర్చకులు రంజితాచారి , రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, పలువురు వేద పండితులు నిర్వహించారు. ఈ కళ్యాణానికి విశేష సంఖ్యలో భక్తులు, ప్రముఖులు పాల్గొని స్వామి అమ్మ వారలను దర్శించుకున్నారు. మహిళలు అమ్మవారికి వోడి బియాన్ని సమర్పించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మ వారలను దర్శించుకున్నారు. శ్రీ సీతారాముల నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది.
అనంతరం భక్తులకు కళ్యాణ అక్షతలను, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని ఆలయ నిర్వాహకులు వితరణ చేశారు.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఈవో సురేందర్, ఆలయ అధ్యక్షులు అశోక్ రావు, కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
