సభ సక్సెస్ అయ్యేనా ??
సిటీ పోలీస్ యాక్ట్ అమలు బహిరంగ సభను అడ్డుకోవడానికేనా ???
కోర్టును ఆశ్రయించనున్న బి.ఆర్.ఎస్ నేతలు
భీమదేవరపల్లి ఏప్రిల్ 7 (ప్రజామంటలు) :
నేటి నుంచి 30 రోజులపాటు అమల్లో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండనుంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మీటింగులు, ఊరేగింపులను నిషేధిస్తూ వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈనెల 27వ తేదీన కమిషనరేట్ పరిధిలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది. సభ అనుమతి కోసం పోలీస్ శాఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ లిఖిత పూర్వక అనుమతి కోరారు. అనుమతిపై ఇప్పటి వరకు పోలీస్ కమిషనరేట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే సభా ఏర్పాట్లలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. ఈ విషయంలో కోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించనున్నారు. ఇప్పటికే ఈ సభ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. గత వారం రోజులుగా సిద్దిపేట ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఆయా ఉమ్మడి జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ
