ఒత్తిడితో కూడిన జీవనశైలితో యువతలో గుండెజబ్బులు - సీనియర్ కార్డియాలజిస్ట్ డా.శ్రీధర్ కస్తూరి
కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో వరల్డ్ హార్ట్ డే
సికింద్రాబాద్, సెప్టెంబర్ 26 (ప్రజామంటలు):
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శుక్రవారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఒత్తిడితో కూడిన జీవనశైలితో యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయని - డాక్టర్ శ్రీధర్ కస్తూరి అన్నారు.
తల్లి కడుపులో పిండం తయారైన మూడు వారాల నుంచి 70 ఏళ్లు వచ్చే వరకు గుండె 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుందని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని శుక్రవారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేటలో గుండె సంబంధ వ్యాధులు, ఆధునిక శస్త్రచికిత్సలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ల సమక్షంలో కేక్ కట్ చేసి వరల్డ్ హార్ట్ డే ఈ సంవత్సరం థీం డోంట్ మిస్ ఎ బీట్ అనే అంశంపై ప్రసంగించారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.7 కోట్లకు పైగా మరణాలు గుండె సంబధ సమస్యలతో సంభవిస్తున్నాయని, వీటిలో 80 శాతం ప్రాథమిక నిర్ధారణ, సకాలంలో వైద్యసేవలు, జీవణశైలి మార్పుతో అదుపుచేయవచ్చని డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. తల్లి కడుపులో పిండం తయారైన మూడు వారాల నుంచి 70 ఏళ్లు వచ్చే వరకు గుండె 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుందన్నారు. డయాబెటీస్, స్మోకింగ్, రోజు రోజుకు పెరుగుతున్న మైక్రో ప్లాస్టిక్, ట్రాఫిక్ పొల్యూషన్ వంటి వాటికి ఎక్కువగా ఎక్స్ పోజ్ కావడం గుండె సమస్యలకు కారణమవుతోందని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
శారీరక శ్రమ, అసమతుల్య ఆహారం, మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతున్నాయి. చిన్న చిన్న స్కానింగ్లు, పరీక్షలతో ముందుగానే ప్రమాద సూచికలను గుర్తించవచ్చని తెలిపారు. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు, చక్కెర తక్కువ తీసుకుంటూ, కొవ్వును తగ్గించుకోవడం, ప్రతి రోజు వ్యాయామం, స్మోకింగ్, మధ్యపానాన్ని పరిమితం చేయడం, యోగా, ధ్యానం చేయడం వల్ల గుండెపై ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్లు డాక్టర్ శైలేందర్ సింగ్, డాక్టర్ విజయకుమార్ రెడ్డి, కార్డియో థొరిసిక్ సర్జన్లు డాక్టర్ పి.ఎన్.రావు, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రీధర్ శాస్త్రి, కార్డియాజిస్టులు డాక్టర్ రాజారాం, డాక్టర్ ప్రణయ్, డాక్టర్ పార్థసారధి, డాక్టర్ సురేందర్, డాక్టర్ కావ్య, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ హిమాన్షు, డాక్టర్ అపరంజి, డాక్టర్ అవినిష్, డాక్టర్ కిషన్లు, డాక్టర్ వంశీ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, కార్డియాక్ అనిస్ట్రేటిస్ట్ డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ రుద్ర, డాక్టర్ మంగళ, డాక్టర్ కృష్ణ కిరణ్, ఏవిపి చందర్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన
