ఉజ్జయిని మహాకాళి ఆలయ చండీ యాగం...
పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన డా.కోట నీలిమ
సికింద్రాబాద్ సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు):
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ పండితులు, సిబ్బంది కోట నీలిమ కు ఆలయ సంప్రదాయం ప్రకారం సన్నాయి వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. ఈ క్రమంలో ఆలయంలో ఏర్పాటు చేసిన చండీ యాగంలో పాల్గొన్నారు. భక్తులతో మమేకమై వసతులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ..కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తుల పూజలు అందుకుంటున్న అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఆలయానికి భారీగా నిధులు కేటాయిస్తోందన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించడం సంతోషదాయకమని తెలిపారు. దేవి సమక్షంలో చండీ యాగంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారని తెలిపారు. మరోవైపు పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన కనక దుర్గ మండపాలను సందర్శించి దుర్గామాత అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం
.jpeg)
ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు
.jpeg)
రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు
.jpeg)
మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్
.jpg)
రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర
.jpeg)
వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి
