కిమ్స్ లో న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ వర్క్ షాప్
ముఖ్య అతిథిగా పాల్గొన్న నెదర్లాండ్స్ సాక్షియన్ యూనివర్సిటీ డాక్టర్
సికింద్రాబాద్, ఆగస్ట్ 14 (ప్రజా మంటలు) :
కిమ్స్ హాస్పిటల్స్ రీహాబిలిటేషన్ విభాగం మరియు ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ సంయుక్తంగా క్లినికల్ రీజనింగ్ ఇన్ ప్రోప్రియోసెప్టివ్ న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ పై కీలక ప్రసంగాన్ని నిర్వహించాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఫిజియోథెరపిస్టులు పాల్గొన్న 10 రోజుల ప్రాక్టికల్ వర్క్షాప్ కీలక ప్రసంగంతో ముగిసింది. ఈ హైబ్రిడ్ ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు.
నెదర్లాండ్ లోని సాక్షియన్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ ఖ్యాతి గల ఐపీఎన్ఎఫ్ఏ ఇన్‌స్ట్రక్టర్ డాక్టర్ ఫ్రెడ్ స్మీడ్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం ఇచ్చారు. మస్క్యులోస్కెలెటల్ మరియు న్యూరాలజికల్ సమస్యలతో బాధపడుతున్న రోగులలో స్థూల మోటార్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి న్యూరో ఫెసిలిటేషన్ టెక్నిక్స్ ను ఏకీకృతం చేయడంలోని ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న తార్కికతపై ఆయన చర్చించారు. అలాగే, పలు వ్యాధులతో బాధపడుతున్న రోగుల పునరావాసంలో ఉపయోగించే పద్ధతులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏషియన్ ట్రాన్స్కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ యూనిట్ హెడ్ డాక్టర్ సునీల్ రెడ్డి (పీటీ) మాట్లాడుతూ ..ఈ వర్క్షాప్ లక్ష్యం థెరపిస్టులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, ప్రోప్రియోసెప్టివ్ న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్‌ను అర్థం చేసుకునేలా చేయడం, అంతర్జాతీయ నిపుణుల మార్గదర్శకత్వంలో వారికి ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడమని తెలిపారు.కిమ్స్ ఆసుపత్రుల సెంటర్ ఫర్ రీహాబిలిటేషన్ డైరెక్టర్ డాక్టర్ సుధీంద్ర వూటూరి మాట్లాడుతూ – ఫిజియోథెరపీ, ఆధునిక వైద్య సేవలకు సాటిగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రోప్రియోసెప్టివ్ న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ (పీఎన్ఎఫ్) అనేది శరీరంలోని ప్రోప్రియోసెప్టర్లను లక్ష్యంగా చేసుకుని కండరాల బలం, సౌలభ్యం, సమతుల్యం, ఫంక్షనల్ మూవ్‌మెంట్ ప్యాటర్న్ ను మెరుగుపరిచే రీహాబిలిటేషన్ పద్ధతి. ఇది గాయాల నుండి లేదా న్యూరాలజికల్ పరిస్థితుల నుండి కోలుకుంటున్న వ్యక్తుల పునరావాసంలోనే కాకుండా, క్రీడాకారులు పనితీరును గరిష్టం చేసుకోవడానికి, గాయాలను నివారించుకోవడానికి కూడా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శాతవాహన స్కూల్ లో జండపండుగ

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,
