అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
జగిత్యాల జులై 13 (ప్రజా మంటలు):
ఆషాడమాసమును పురస్కరించుకుని పట్టణంలోని ధరూర్ క్యాంప్ లో గల అచ్చుబండ పోచమ్మ తల్లికి ప్రైమ్ హైట్స్ కుటుంబ సభ్యులు ఆదివారం అత్యంత ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని డప్పుల చప్పట్లతో నడుచుకుంటూ వెళ్లి అమ్మలగన్న అమ్మ పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి నైవేద్యాన్ని అర్పించినారు.
మహిళలు పిల్లలు పెద్దలు అందరూ పోచమ్మ తల్లి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ప్రజానీకమంతా ఆరోగ్యాలతో ఆనందాలతో సస్య శ్యామలంగా ఉండాలని అందులో మేము కూడా ఉండాలని పోచమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడ మాసంలో చివరి ఆదివారం కావడంతో అచ్చబండ పోచమ్మ తల్లి ఆలయంలో కిక్కిరిసిన భక్తులతో ఆలయం కలకల్లాడింది. ధరూర్ క్యాంపు లోని , సమీపంలోని కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో బోనాల తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రైమ్ హైట్స్ అధ్యక్షులు రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ , కోశాధికారి భూపాలరావు, సభ్యులు రవీందర్రావు , నరేష్ , వరుణ్ కుమార్, ఆనంద్, శ్రీధర్, సదానందం, సతీష్ , రామాంజనేయులు , రామ కృష్ణ, శ్రీధర్ రెడ్డి, మహిళలు, పిల్లలు , బంధువులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి
