ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్
మల్కాజ్‌గిరి, జూలై 11 (ప్రజా మంటలు)
మల్కాజ్‌గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఓల్డ్ మల్కాజ్‌గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా (డ్రైనేజీ) పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్ వర్క్‌లు చేపడుతున్నామని తెలిపారు.
పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ పనులు అత్యంత ప్రాధాన్యతతో జరుగుతున్నాయని ఆయన అన్నారు. నాణ్యతతో కూడిన పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సఫిల్‌గూడ లేక్ పార్కులోని వినాయక నిమజ్జనం కోసం ఉపయోగించే మినీ ట్యాంక్ ఆధునీకరణకు దాదాపు రూ.1.5 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలియజేశారు.
ఈ నిధులతో మినీ ట్యాంక్‌ను ఆధునికీకరించి, భక్తులకు మరింత సౌకర్యవంతమైన నిమజ్జన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన వివరించారు. ఈ పనుల ద్వారా స్థానికులకు మెరుగైన రోడ్డు రవాణా, పరిశుభ్రమైన వాతావరణం, అలాగే పండుగల సమయంలో సౌకర్యవంతమైన ఏర్పాట్లు అందుబాటులోకి వస్తాయని కార్పొరేటర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో జిహెచ్ఎంసి ఏఈ నవీన్, వాటర్స్ వర్క్స్ ఏ ఈ తేజస్విని, రమేష్, మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ, రవి, సునీల్ యాదవ్, జైకృష్ణ, ధర్మతేజ,బాబు రావు, శంకర్, సాయి,శివ, మహేందర్, శ్రీకాంత్, భారత్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
