గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.
సికింద్రాబాద్, జూలై 09 (ప్రజామంటలు) :
కల్తీ కల్లు తాగిన ఘటనలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం(47) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రోజు కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో అదే రోజున అరుంధతి ఆసుపత్రికి వెళ్ళినట్లు అతని భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాం అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు, గత తొమ్మిది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మేస్త్రీగా పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇతనికి కల్లు తాగి అలవాటు ఉన్నట్లు పేర్కొన్నారు. కల్తీ కల్లు మూలంగానే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు ఘటన బాధితులు విజయ్, కృష్ణయ్యలను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా సీతారాం ను గాంధీకి తీసుకువచ్చేటప్పుడే చనిపోయాడని, అతడు బ్రాట్ డెడ్ అని, అతని మరణానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని, పోస్టుమార్టంలో కారణాలు వివరంగా తెలుస్తాయని గాంధీ వైద్యులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
