వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ
సికింద్రాబాద్, జూలై 02 ( ప్రజామంటలు) :
బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ హరిచందనతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రథం ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించడంపై డాక్టర్ కోట నీలిమ అధికారులకు అభినందనలు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసిన జీహెచ్‌ఎంసీ, విద్యుత్, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్‌బీ, వాటర్ వర్క్స్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులను అభినందించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, భక్తులకు సేవలు చేసిన వాలంటీర్లను మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదం లేకుండా ఇదంతా సాధ్యం కాదన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
