సాయి గీత ఆశ్రమంలో ఘనంగా యోగా దినోత్సవం - భక్తులకు సద్గురు డాక్టర్ సాయి కుమార్ ప్రవచనాలు
సికింద్రాబాద్, జూన్ 22 (ప్రజామంటలు):
ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్బంగా శనివారం మేడ్చల్ లోని సాయి గీత ఆశ్రమం వ్యవస్థాపకులు సద్గురు డాక్టర్ సాయి కుమార్ ఆధ్వర్యంలో యోగా ఉత్సవాలు నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ..యోగా అనేతి శరీరోగ్యం, మానసిక స్వస్థత, ఆధ్వ్యాత్మిక శాంతిని అందించే మహా విజ్ఞాన ప్రక్రియ అని అన్నారు. సృష్టిలో ఉన్న 33 కోట్ల జీవ జంతువులకీ ఒక్క యోగాను అనుసరిస్తూ పురాణ రుషులు వాటిని ఆధారంగా తీసుకొని యోగా విధానాన్ని అభివృద్ది చేశారని పేర్కొన్నారు. సూర్య కిరణాల చెట్ల ద్వారా శరీరంలోని ఏడు చక్రాలను ప్రభావితం చేసి అనేక రోగాలను నివారిస్తాయని చెప్పారు. ఈ శ్వాసక్రియ శరీరంలోని 72వేల నాడులను శుద్ది చేస్తుందన్నారు. పక్షవాతం, క్యాన్సర్, హార్ట్ అటాక్ వంటి వ్యాధులకు కారణమైన నాడి బ్లాకేజీలను తొలగించడంలో సహాయపడుతుందని వివరించారు. సూపర్ యోగా అనగా సూర్యోదయానికి పూర్వం లేచి ఇంట్లో మానవుడు తన పని తాను చేసుకోగలిగితే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరని అన్నారు. ఏమి తినాలి, ఎలా తినాలి ఎంత తినాలి వంటి ఆరోగ్యకర జీవనశైలి గురించి అవగాహన కల్పించారు. ఈసందర్బంగా ఆశ్రమానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈసందర్బంగా సూర్య నమస్కారం, మండూక యోగ, ప్రాణాయామం,మర్కట యోగా వంటి యోగాసనాలను ప్రదర్శించారు. ప్రతి శని, ఆదివారాలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సాయి గీత ఆశ్రమంలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన కూల్చివేత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి
