నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 3(ప్రజా మంటలు)
*అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు పెన్నులు,పెన్సిళ్లు తీసుకురావొద్దు*
*పరీక్షా కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్నులు అందజేత*
*ఈ నెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష పై అభ్యర్థులకు పలు సూచనలు చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.*
ఈ నెల 4వ తేదీన(ఆదివారం)నీట్ పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అనుమతిస్తారని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు
నీట్ పరీక్ష నిర్వహణకు జగిత్యాల జిల్లా పరిధిలో 2 పరీక్షా కేంద్రాలలో 768 అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలోనికి అభ్యర్థులు ప్రవేశించేందుకు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు అనుమతిస్తారని పేర్కొన్నారు. నియమిత సమయం దాటిన తర్వాత విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేనందున అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని కోరారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష గదికి వెళ్లే ముందు బయోమెట్రిక్ అటెండెన్స్, రిజిస్ట్రేషన్, తనిఖీ ప్రక్రియ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం1:30 లోగానే చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరొక పోస్ట్ కార్డు సైజు ఫోటోను అడ్మిట్ కార్డుకు అతికించాలని అన్నారు. అదనంగా మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వెంట తెచ్చుకోవాలన్నారు. అప్డేటెడ్ ఆధార్ కార్డును తీసుకురావాలన్నారు. లేటెస్ట్ ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ ను అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి తీసుకురావాలన్నారు. దివ్యాంగులు ధ్రువీకరించిన సర్టిఫికెట్లను తీసుకురావాలన్నారు.
పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు పెన్నులు పెన్సిళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రంలోని అభ్యర్థులకు పెన్నులను అందజేయడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి అనుమతించబడవని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీట్ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిచేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్
