నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

On
నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడా జులిపించిన నిర్మల్ పోలీసులు

క్రిప్టో కరెన్సీబిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తున్న  మూఠా అరెస్ట్  -గుట్టు  రట్టు చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు 

అధిక లాభాల పేర ప్రజలను మోసాలకు గురిచేస్తున్న ఆన్ లైన్ పెట్టుబడుల మూఠా సభ్యుల అరెస్ట్ -  ఎక్సైజ్ ఎస్ ఐ, ఏ ఆర్ కానిస్టేబుల్ తో సహా ఐదుగురి అరెస్ట్                 

చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు -జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల

 నిర్మల్ సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు) :

ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి  మోసాలు చేస్తున్నారు  కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని దురాశతో కొంత మంది కలిసి  ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళనివ్యాపారాలు చేసే వాళ్ళని వారితో పాటు  మద్యతరగతి వారిని ఏదో ఆశ చూపి బురిడి కొట్టించి వారందరినీ ఆన్లైన్  కాయిన్ వ్యాపారం గురించి తెలియపరిచి వారితో డబ్బులు కట్టిస్తున్నారు. జిల్లాలో కడెం నుండి ప్రారంబించి ఇలా అన్ని జిల్లాలప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని.కొన్ని రోజుల తర్వాత ఈ క్రిప్టో కాయిన్ మోసపూరితమని  తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు.   నిర్మల్ పోలీస్ మీ పోలీస్ లో బాగంగా ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల తెలుసుకొని అవినాష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినారు. అయితే వీరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వారిని పట్టుకోవడం జరిగిందని మొదటగా నవాబ్ పేట కు చెందిణ  సళ్ళ రాజ్ కుమార్ ను విచారించగా,  మొత్తం నేరం ఒప్పుకుని అన్నీ వివరించారు. తరువాత  మూత సభ్యులైన సాయి కిరణ్, కందెలా నరేష్(టీచర్),నిర్మల్ కు చెందిన  గంగాధర్, ఎక్సైజ్  ఎస్ ఐ  గంగాధర్, ఏ ఆర్ కానిస్టేబుల్ మహేష్ లను  తీసుకవచ్చి విచారణ చేయగా మొత్తం వివరాలు తెలిపారని పోలీసులు తెలిపారు.

  సల్ల రాజ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం యు నెట్ క్వీన్, యు- బీట్ క్వీన్  అనే ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి మీకు డాలర్ల రూపంలో మీకు వస్తాయి లేకుంటే మాది పూచీకత్తు అంటూ మరియు 500 రోజులలో (ఏడాదిన్నర) 5 నుండి 10 రెట్లు పెంచుకునే అవకాశం ! కనీస కొనుగోలు :- 50$ (5,000). గరిష్ట కొనుగోలు :- 10,000$ (10 లక్షలు). నాన్ వర్కింగ్ ఇన్ కం :- స్టేకింగ్ బోనస్ రోజుకు 0.5% అంటే నెలకు 15% (500 రోజులు). వర్కింగ్ ఇన్ కం :- రిఫరల్ బోనస్ 1% - 100%. లెవెల్ బోనస్ 1 - 50 లెవెల్స్. లీడర్ షిప్ బోనస్ :- 1- 7%,  10 కోట్ల ఇది కంపెనీ కాదు. ఉద్యోగం కాదు. వ్యాపారం కాదు. పెట్టుబడి కాదు.

మీరు ఎంత మందిని జాయిన్ చెపిస్తే మీకు అంతా లాభాలు  వస్తుందని పెద్ద పెద్ద ఆశలు చూపించి వారందరిని మభ్యపెట్టి ఇట్టి వ్యాపారంలో  చాలా మంది ఉద్యోగస్తుల్ని చిన్నమధ్య తరగతి వారిచే పెట్టుబడి పెట్టించి నెలకి కొంత సొమ్ము వారికి చెల్లిస్తూ విస్తరించారు.  ఇట్టి వ్యాపారానికి ఎటువంటి గుర్తింపు లేదు. బాధితులపై ఈ పథకం ప్రభావం తీవ్రంగా ఉంది. అమాయకుల నుంచి వసూలు చేసిన సొమ్ము దుర్వినియోగం అవుతోంది,అక్రమార్కులు చేసిన తప్పుడు వాగ్దానాలను నమ్మి ఆర్థికంగా నష్టపోతున్నారు.  ఈ వ్యాపారం వెబ్ పోర్టల్ పనిచేయకపోతే ముందుగా జాయిన్ అయిన వారు లభ్యపడతారని కానీ ఎక్కువ శాతం కొత్తగా పెట్టుబడి పెట్టినవారు నష్టపోతున్నారు. ముందుగా జాయిన్ అయిన వారికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యాపారం రూపొందించబడింది.

వీరు మొదటగా ఒకరిని జాయిన్ చేపించిన తర్వాత ఇంకొకరితో ఒత్తిడి తీసుకవస్తారు.  మళ్లీ కొత్త వారిని జాయిన్ చేపిస్తారు. వీళ్లను సళ్ళ రాజ్ కుమార్  మెటా మసక  లో ఖాతాను సృష్టించి,  మరియు ఆ తర్వాత యు బీట్  క్రిప్టోలో ఖాతాను తెరిచాడు.

ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడిందనిఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని చెబుతాడు. అయితేఅతను కనీసం $3,000 (సుమారు 2,52,000) పెట్టుబడితో ఐదుగురిని చేర్చినట్లయితేఅతను నిర్ణీత కమీషన్ రేటుతో రోజువారీ ఆదాయాన్ని పొందడం పొందుతారు. ఇదే కాక ఇంకొక బిజినెస్ లో  కొత్త చేరికలు గొలుసు కట్టులో గొలుసు పెరిగే కొద్దీకమీషన్ కూడా పెరుగుతుందిపెట్టుబడి పెట్టిన డబ్బు విలువ మూడు రెట్లు పెరుగుతుందని వాగ్దానం చేస్తారు. లాభదాయకమైన ఒప్పందాలను అందించడం మరియు తప్పుడు వాగ్దానాలు చేయడం ద్వారా ఒక వ్యక్తిని స్కీమ్‌లో చేర్చవచ్చని సళ్ళ రాజ్ కుమార్ వాళ్లని నమ్మిస్తాడు. నిర్మల్ జిల్లాలో యుబీట్ అనే కరెన్సీ నెట్వర్క్ తో పాటు ఇతర వ్యక్తులను ఈ పథకానికి జాయిన్ చేస్తున్నట్లు తెలిపాడు. దీనికంతా ఇతను బాధ్యత వహించినట్లు  విచారణలో అంగీకరించాడు. ఇతను సాయి కిరణ్ ని గుర్తించి యుబీట్ నెట్ వర్క్ ను విస్తరించడంలో సాయికృష్ణ తో పాటు నరేష్మహేష్మరియు గంగాధర్ కీలకంగా ఉన్నారు

వీరందరూ ఒకరి తరువాత ఒకరు వ్యాపారంలో చేరారుతప్పుడు వాగ్దానాలతో వ్యక్తులను చేర్పించారు మరియు వారి డబ్బును ఎలా మోసం చేసారు అనే వివరాలను వివరించారు. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 0.5% అంటే 500 రూపాయలు ఇస్తానని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి, యు బీట్, క్రీ ప్టో కరెన్సీ, లో పెట్టుబడి పెట్టమని నమ్మించి సళ్ళ రాజ్ కుమార్ మరియు మహేష్గంగాధర్‌తో కలిసి గతంలో స్కూల్‌మేట్ అయిన సాయి కృష్ణతో కుట్ర పన్నారని ఇతను ఒప్పుకున్నాడు.       

డబ్బు సంపాదించడం కోసం మరికొంతమంది అమాయక వ్యక్తులతో వాట్స్ ఆప్  గ్రూప్‌ని సృష్టించారు. ఈ సమాచారాన్ని గ్రూప్ లో చెరవేస్తూ అందరికీ ఆశ చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రజలందరిని మోసం చేసి జాయిన్ చేపిస్తారు. ఇప్పటికైనా జిల్లా వాసులు ఇలాంటి మోసపూరితమైన బిజినెస్ లకు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ లకు పెట్టుకోవద్దనిమీ కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోవద్దనిఇలాంటివారు మళ్లీ ఎవరైనా వస్తే మాకు సమాచారం తెలపండి అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు..

 కేసుని విచారించటంలో చక్కటి ప్రతిభ చూపించినటువంటి ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ డిఎస్పి గంగారెడ్డితో పాటు నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఎస్సైలు సాయి కృష్ణ,  ఎం రవి,  రవీందర్ మరియు కానిస్టేబుల్ తిరుపతి, గణేష్,  శోకత్,  సతీష్ లను ఎస్పీ  ప్రశంసించారు.

Tags