స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
సామాజిక సమరసత వేదిక కళ మంచు కన్వీనర్ అప్పల ప్రసాద్ జి
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 03 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
రాజ్యాంగ విలువలు, స్వదేశీ,స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని సామాజిక సమరసత వేదిక కళ మంచు కన్వీనర్ అప్పల ప్రసాద్ జి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో ఆర్ ఎస్ ఎస్ విజయదశమి ఉత్సవం జరిగింది. ముఖ్య అతిథి గా పాల్గొన్న ప్రసాద్ జి మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ వందేళ్లుగా రాజ్యాంగ బద్దంగా ఈ దేశ అభ్యున్నతి కొరకు పనిచేస్తుందని చెప్పారు.
ఈ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు ఆర్ ఎస్ ఎస్ చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు. దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ ఎస్ ఎస్ ను ప్రజలకు చేరువ చేసిందన్నారు.1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు.
ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని వాక్యనించారు.ఈకార్యక్రమంలో విభాగ్ సేవా ప్రముఖ్ ఆకు రాజేందర్,ముఖ్య అతిథి గుమ్మల్ల తిరుపతి ఖండగ్రామీణ వికాస్ ప్రముఖ్ పుప్ఫాల వెంకటేష్,ఖండ బౌద్దిక్ ప్రముఖ్ న్యావనంది నవీన్,ఉప మండల ప్రముఖ్
కొంపల్లి రాజయ్య ,సహకారసంఘ చైర్మన్ అంకతి రాజన్న, సున్నం సత్యం ,పెంట లింబాద్రి,రెడ్డవేన అజయ్ కుమార్, కోటగిరి అశోక్,ఎడిపెళ్ళి మురళి, గుజ్జె గంగాధర్, దోనికెన రాజేష్ స్వయంసేవక్ సంఘ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
