వయోవృద్ధులకు టాస్కా ఆసరా
మూగ మహిళకు వస్త్రాలు,దుప్పట్లు అందిస్తున్న హరి ఆశోక్ కుమార్
అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం .
జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు):
వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
బుధవారం ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 35 వ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 12 మంది నిరుపేదలకు నూతన వస్త్రాలు,దుప్పట్లు,టవల్స్ హరి ఆశోక్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.అలాగే వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 12 మంది సీనియర్ సిటీజేన్స్ మిర్యాల రాజన్న పెంబట్ల,తోట రాజాకిషన్,మోతె మదన్ మోహన్ రావు,ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య,సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ కే.లావణ్య,ఎలమిల్ల సత్తయ్య,వావిలాల రమాకాంత్,మహమ్మద్ జాఫర్,మాజీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ శ్రీనివాస్,కొక్కుల ఆంజనేయులు,బట్టు లక్ష్మన్ రాజులను మెమోంటోలు,శాలువాలతో సన్మానించారు.
అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్,కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి,మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ లు వృద్ధుల నిరాదరణ కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలిచారన్నారు.వయోవృద్ధులైన తల్లిదండ్రులని నిరాదరిస్తే 3 నెలల జైలు శిక్ష తో పాటు జరిమాన ఆర్డీవో విధిస్తారని,మోసం తో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరిగి తల్లిదండ్రుల పేరిట కలెక్టర్ కు మార్చే అధికారం ఉందని వయోవృద్ధుల చట్టంలోని అంశాలను వివరించారు.సఖీ అడ్మినిస్ట్రేటర్ లావణ్య సఖీ సేవలను ,ఫీల్డ్ అధికారి కొండయ్య సీనియర్ సిటీజేన్స్ కార్యాలయం సేవలను వివరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు పి.హన్మంత్ రెడ్డి,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,కే.సత్యనారాయణ,సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లావణ్య,ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,కార్యదర్శి దుబ్బేశం, గొల్లపల్లి అధ్యక్షుడు వీరారెడ్డి,మెట్ పల్లి అధ్యక్షుడు వొజ్జెల బుచ్చిరెడ్డి,మహిళా జేఏసీ నాయకురాల్లు కూడా జలజ,కరుణ,జిల్లా,డివిజన్, మండలాల సీనియర్ సిటీజేన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
విశిష్ట వయోవృద్ధులను సన్మానిస్తున్న టాస్కా కార్యవర్గం
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
