రాజకీయ పార్టీ ప్రతినిధులతో కరీంనగర్ కలెక్టర్ సమావేశం
కాంగ్రెస్ తరపున హాజరైన డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్
ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటిస్తాం: సిరాజ్ హుస్సేన్
కరీంనగర్ సెప్టెంబర్ 30 (ప్రజా మంటల):
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజు హుస్సేన్ హాజరయ్యారు.
ఎలక్షన్ కమిషన్ విధించిన నిబంధనలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా పాటిస్తామని రూల్స్ ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయబోమని సిరాజు హుస్సేన్ సమావేశంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించేలా కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు లోబడే ప్రచారము ఇతర కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లాలో రెండు విడతల్లో జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు, రెండు విడతల్లో గ్రామ పంచాయతీ లకు( సర్పంచ్, వార్డు సభ్యులు)ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. మొత్తం నాలుగు విడతల్లో జిల్లాలో ఎన్నికలు ముగుస్తాయన్నారు.
అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ మరియు వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
