సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.
33 జిల్లాల్లో వాసవి క్లబ్ సేవ కార్యక్రమాలు బేష్
రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి
జింఖానా గ్రౌండ్ లో వాసవి క్లబ్ ఫౌండేషన్ డే
డ్రగ్స్ కు వ్యతిరేకంగా గాల్లోకి లక్ష బెలూన్స్..
సికింద్రాబాద్, అక్టోబర్ 01 (ప్రజామంటలు) :
ప్రపంచంలో చాలా మంది బిజినెస్ మెన్స్ ఛారిటీ చేస్తారని, ఛారిటీ చేసే వారు తమ రంగంలో గొప్పగా రాణిస్తారని రాష్ర్ట కార్మిక, ఉపాధి శిక్షణ,ఫ్యాక్టరీల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సికింద్రాబాద్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ను జింఖాన(ఫుట్ బాల్)గ్రౌండ్ లో బుధవారం ఘనంగా నిర్వహించగా, మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే మరో పది మందికి సాయం చేస్తారన్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా స్ర్టాంగ్ గా ఉందని, వాసవి క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు చేరుతుందన్నారు. ఒకరు చేసే మంచి పనిని ప్రచారం చేయడం వలన దానిని మరికొందరు స్పూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమాలను చేస్తున్న వాసవి క్లబ్ ను మంత్రి అభినందించారు. ఈసందర్బంగా వాసవి క్లబ్ నిర్వాహకులు మంత్రిని కరెన్సీ మాల, శాలువాతో ఘనంగా సత్కరించి, మెమోంటోను అందచేశారు. అనంతరం మత్తు వీడండి..మైదానాలకు రండి...అనే స్లోగన్ తో వాసవి క్లబ్ మెంబర్స్ తో కలసి మంత్రి వివేక్ వెంకటస్వామి లక్ష బెలూన్లను గాలిలోకి వదిలేశారు. సే టు నో డ్రగ్స్... నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వాసవి క్లబ్ మెంబర్స్ ను మంత్రి అభినందించారు. అనంతరం వందమంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ మాట్లాడుతూ..1961 లో కేవలం పదుల సంఖ్య కలిగిన సభ్యులతో స్థాపితమైన వాసవిక్లబ్ సంస్థ ఈరోజు రెండు వేల మంది సభ్యులతో కోట్లాది రూపాయల వ్యయంతో ప్రతి ఏటా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ, సేవా కార్యక్రమాలను చేపడుతుందన్నారు.
తమ సేవాలను గుర్తించి 2013 లో అప్పటి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ వాసవిక్లబ్ కు అవార్డును అందచేశారన్నారు. రాజకీయాలకతీతంగా వాసవిక్లబ్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ఇంటర్నేషన్ సీనియర్ నాయకులు గంప శ్రీనివాస్,యాద నాగేశ్వరరావు, ముక్తా శ్రీనివాస్,డిస్ర్టిక్ట్ గవర్నర్ అశోక్ కుమార్,సూర్య ప్రకాశ్,శ్రీనివాసులు, సూర్యప్రకాశ్, సుజాత రమేశ్ బాబుతో పాటు పెద్ద వివిద ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన వాసవిక్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు:
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
