మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, అక్టోబర్ 03 ( ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంగోపాల్ డివిజన్ ఎంజీ రోడ్డు, గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న భారీ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. సత్యం, అహింస అనేవి పదునైన ఆయుధాలని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ అన్నారు. దేశానికి అయన చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరు గాంధేయ వాదంలో నడవలన్నారు. గాంధీజీ సిద్ధాంతాలు అందరికి స్ఫూర్తిదాయకం అన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
