తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం బతుకమ్మ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి స్టెప్టెంబర్ 29 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో తొమ్మిది అంతరలుగా పేర్చిన సద్దుల బతుకమ్మ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. రంగురంగుల పూలతో సంబరమంతా తనదే అన్నట్టు ఉంటుంది. బతుకమ్మకు పోటీగా ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎంతో అందంగా తయారయ్యి చెట్టులో పువ్వంత హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు.ఇదంతా ఒక ఎత్తు అయితే సద్దుల బతుకమ్మ సాయంత్రం ఒక ఎత్తు. ఆ రోజే బతుకమ్మ ముగింపు.
బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలో వదిలిపెట్టి మళ్ళీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూస్తారు.సాయంత్రం ఆడపిల్లలు, ఆడవారు అందరూ ఇంతెత్తున పేర్చిన బతుకమ్మను తీసుకుని ఊరు మధ్యలో చేరి పెద్ద పెద్ద బతుకమ్మల చుట్టూ చేరి గుండ్రంగా తిరుగుతూ, జానపద పాటలు పాడతారు, ఆడతారు.చీకటి పడేవరకు ఆడి పాడి, ఆ తరువాత బతుకమ్మలను ఎత్తుకుని ఊరేగుతూ వెళ్ళి బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ తరువాత రొట్టె, చెక్కెరతో తయారు చేసిన నైవేద్యం ను అందరికి పంచి తాము తిని, ఇంటికి వెళ్లి ఇంటిల్లిపాదికి పంచిపెడతారు. దాంతో సద్దుల బతుకమ్మతో పాటు బతుకమ్మ పండుగ ముగుస్తుంది.
తొమ్మిదిరోజు బతుకమ్మలు వదిలిన నీటి ప్రాంతాలన్నీ పూలతో నిండిపోయి కొత్త చీర కట్టుకున్న గంగమ్మలా కనువిందు చేస్తాయి. ప్రతీ ఇంటిలోనూ అందరి ముఖాలు కళకళలాడతాయి ఆనందం మహిళలు ఆడుకున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
