ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలి.... రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని
జగిత్యాల సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు )
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్, జిల్లా కలెక్టర్ లతో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో లు, ఎంపిడివో లు,మున్సిపల్ కమీషనర్ లు లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్పిటిసి, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు.
రెండు విడతలలో స్థానిక సంస్థలను, 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల జరిగిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే ప్రాంతాలలో అమలులోకి రావడం జరుగుతుందని అన్నారు. ఎం.సి.సి. నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను చేపట్టే రిపోర్ట్ అందించాలని అన్నారు.
ఓటర్లను ప్రభావితం చేసేలా, ఎంసిసి నిబంధనలకు విరుద్ధంగా అర్బన్ ప్రాంతాలలో, సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలు చేస్తే వారిపై ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో జెడ్పీ సిఈఓ గౌతమ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిణి మదన్ మోహన్, జిల్లా నోడల్ అధికారులు, ఎంపిడివో లు, ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
