పేద ప్రజలను పీడిస్తున్న ఆసుపత్రులను సీజ్ చేయాలి.
మెట్టుపల్లి సెప్టెంబర్ 28( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని సాయి సంజీవని హాస్పిటల్ వైద్యులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారంటూ బాధితుడు ఆకుల హనుమాండ్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్ పల్లి పట్టణానికి చెందిన నేను , నా తల్లి ఇంట్లో కాలుజారి పడటంతో, కాలుకు బలమైన గాయం కాగా పట్టణంలోని సాయి సంజీవని హాస్పిటల్ కు తీసుకువెళ్లానని, అక్కడ వేసిన బిల్లులు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.
ఇదే కాకుండా,హాస్పిటల్ కు పార్కింగ్ లేకపోవడంతో, రోడ్డుపై తన వాహనాన్ని నిలిపి ఆసుపత్రిలోకి తన తల్లిని తీసుకు వెళ్తుండగా, మరో వాహనం యాక్సిడెంట్ చేసేదని బాధ వ్యక్త పరిచారు.
హాస్పిటల్ లోకి తన తల్లిని తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయాలని సూచించగా, 700 రూపాయలు ఖర్చు అవ్వాల్సిన పరీక్షలు 4800 వసూలు చేశారని, ఎందుకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని డాక్టర్ను అడగగా ఆరోగ్యశ్రీ ఉందని అది తమ హాస్పిటల్కు ఊరికే రాలేదని అందుకోసమే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నామని డాక్టర్ త్రిలోక్ తెలిపారని అన్నారు.
దీంతో తాను కంగుతిన్నానని అయినప్పటికీ వైద్యం చేయాలని డబ్బులు చెల్లించగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వైద్యం చేసినట్లుగా నానా హంగామా సృష్టించి సాయంత్రం తమతో కాదని చేతులెత్తేసి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కానీ,హైదరాబాద్ కానీ తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించగా తన తల్లి అవస్థ భరించలేక బాధతో నిజామాబాద్ హాస్పిటల్కు తరలించామని ఆకుల హనుమాన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఎలాంటి వసతులు లేవని, అయినప్పటికీ అధికారులు దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆకుల హన్మాండ్లు ఆగ్రహించారు. మెట్ పల్లి లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను పీడిస్తున్న ఆసుపత్రులను గుర్తించి వాటిని సీజ్ చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అధికారులను ఆదేశించి చర్యలు తీసుకోవాలని ప్రజాసేన పార్టీ తరఫున కోరుతున్నానని ఆకుల హనుమండ్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
