భావితరాలకు స్ఫూర్తి ఐలమ్మ జీవితం.
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే.లక్ష్మణ్.
సికింద్రాబాద్, సెప్టెంబర్ 26 (ప్రజామంటలు :
భూమికోసం భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేసిందని నిజాం నవాబుకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రజక సెల్ రాష్ర్ట అధ్యక్షులు మల్లేశ్వరపు రాజేశ్వరి ఆధ్వర్యంలో ఐలమ్మ130 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... కౌలుకు తీసుకొని తాను పండించిన పంటను దేశముఖ్ రేపాక రామ్ చంద్రరెడ్డి తన అనుచరులతో ధాన్యాన్ని దొంగతనంగా తరలించుకొని పోవడానికి ప్రయత్నించగా వారిని ఎదిరించి తరిమికొట్టిన వీరనారి చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని అన్నారు. బాంచన్ కాల్మొక్త అన్న బానిస బ్రతుకుల నుండి బడుగులను విముక్తి చేసిన వీరవనిత ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఐలమ్మ జీవితాన్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేర్చాలని హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏదైనా జిల్లాకు ఐలమ్మ పేరును నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ బుర్ర నరసయ్య గౌడ్ ఆకారం రమేష్ సురేందర్ యాదవ్ కిరణ్ గౌడ్ కరణ్ శైలేందర్ శ్రీనివాస్. నర్సింగ్ చందు సంజయ్ గనాటే సంపత్ హైమా రెడ్డి ప్రసన్న లక్ష్మీ ప్రసన్న ప్రియా కావ్య కిరణ్మయి. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది

కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం
.jpeg)
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం
.jpeg)