కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది
పతనంతిట్ట (కేరళ) అక్టోబర్ 22:
కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శబరిమల ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళగా చిన్న హెలికాప్టర్ ఇబ్బంది ఎదురయ్యింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో హెలిప్యాడ్ పై ఒక పక్కకు ఒరిగి, భూమిలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటనలో రాష్ట్రపతికి ఎటువంటి గాయాలు కలగలేదు అని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రపతి నాలుగు రోజుల పర్యటన కోసం సాయంత్రం తిరువనంతపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం పతనంతిట్టకు వెళ్లి, రాజీవంది ఇండోర్ స్టేడియం సమీపంలో హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుండి బయటకు తీసారు. తరువాత, ఆమె రోడ్డు మార్గంలో పంబాకు బయలుదేరి శబరిమల చేరారు.
హెలికాప్టర్ మొదట పంబా సమీపంలోని నీలక్కల్ వద్ద ల్యాండ్ చేయాల్సి ఉన్నప్పటికీ, ప్రతికూల వాతావరణ కారణంగా చివరి నిమిషంలో ల్యాండింగ్ స్థలాన్ని ప్రమాధం ప్రాంతానికి మార్చారు. హెలిప్యాడ్ మంగళవారం రాత్రే నిర్మించబడినందున, కాంక్రీటు పూర్తిగా ఎండకముందే హెలికాప్టర్ ఆపరేట్ చేయడానికి ప్రయత్నించగా ఇది కూలిపోయింది అని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
పంబాకు చేరిన తర్వాత రాష్ట్రపతి ఇరుముడితో శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:- రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలసన్నిధాన
.jpg)
కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది

కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం
.jpeg)
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్
