ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఆగస్టు 14 ( ప్రజా మంటలు)
జిల్లాలో డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టం లపై పూర్తిస్థాయి లో నిషేధం
గణేష్ నవరాత్రుల సందర్భంగా అధిక స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలు, భారీ సౌండ్ సిస్టంల వినియోగం పూర్తిస్థాయిలో నిషేధం అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజే లు మరియు సౌండ్ సిస్టంలు పూర్తిస్థాయిలో నిషేధమని ఇట్టి విషయంలో గణేష్ మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.
గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి మొదలుకొని నిమర్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా భద్రత పరమైన అన్ని చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నరు. పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా గణేష్ నవరాత్రులు పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని ఎస్పి కోరారు.
జిల్లాలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శాతవాహన స్కూల్ లో జండపండుగ

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,
