సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన పొన్నం ప్రభాకర్, రాజేశం గౌడ్
జగిత్యాల ఆగస్ట్ 13 (ప్రజా మంటలు):
పట్టణ బైపాస్ రోడ్డులో గొల్లపల్లి క్రాస్ వద్ద, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించబడింది. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాడిన మహానుభావుడు సర్వాయి పాపన్న గౌడ్ గారి సేవలు, త్యాగాలు, వీరగాథను స్మరించుకుంటూ గౌడ సమాజం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం విశేషం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పోన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకట్ స్వామి, మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, గవర్నమెంట్ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, దావా వసంత హాజరై విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మరియు మాజీ మంత్రివర్యులు జి. రాజేశం గౌడ్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, గౌడ సంఘం తరఫున ముఖ్య అతిథుల దృష్టికి కొన్ని ముఖ్యమైన సమస్యలను తీసుకువెళ్లారు. ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోని గౌడ హాస్టల్ సమస్యలు, గీత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే విద్యార్థుల విద్యా అవసరాలు, వసతి సౌకర్యాల లోపం వంటి అంశాలను వివరించారు.
గౌడ సంఘం తరఫున ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని, విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని కోరారు.
ఈ అభ్యర్థనలపై కార్యక్రమానికి విచ్చేసిన అన్ని ముఖ్య అతిథులు సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, సర్వాయి పాపన్న చేసిన వీరోచిత పోరాటాలను, ఆయన గోల్కొండ కోటను పరిపాలించిన చారిత్రక ఘట్టాన్ని ప్రస్తావిస్తూ, పాపన్న గారి జీవితం ధైర్యసాహసాలకు, సమానత్వం కోసం చేసిన పోరాటానికి నిదర్శనమని తెలిపారు.
కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామస్తులు,యువత పెద్ద ఎత్తున పాల్గొని, సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలతో సమానమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ వేడుక గౌడ సమాజ ఐక్యతకు, అభ్యున్నతికి కొత్త ఊపును అందించింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
