చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
జగిత్యాల జులై 21 ( ప్రజా మంటలు)
బిసి ల చలో ఢిల్లీ వాల్‍పోస్టర్ ను ఆవిష్కరించిన జగిత్యాల బిసి సంక్షేమ సంఘం నాయకులు.
ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ మన దేశ జనాభాలో సగానికి 72% పైగా ఉన్న బీసీలకు పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23, 24 తేదీలలో "చలో ఢిల్లీ" పేరిట ఓబీసీ జాతీయస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సదస్సులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి బీసీలు పాల్గొంటారని చెప్పారు. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో చలో ఢిల్లీకి సంబంధించిన వాల్‍పోస్టర్ ను ఆవిష్కరించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పరచాలని, రెండు లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు .
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేసే విషయమై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ లో స్వయానా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పాటించకపోవడం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 243 D,T లలో ఉన్న సవరణ రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ అమలు చేసేటటువంటి హక్కు ఉన్నది. ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బిసి నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్వర్గీయ దాశరథి కృష్ణమాచారి 101 వ జయంతి సందర్భంగా తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన కవితాబివంధనాలు.

తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా...

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు - పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం

ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన ఎండోమెంట్ కమిషనర్

ప్రధాన రహదారిపై గుంతలు -- ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు

గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు.

హనుమకొండ జిల్లా హడుప్సా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సబర్మతి సురేష్ కుమార్

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్
