పాటల ప్రయాణంలో రాజేందర్ మరింత ఉన్నతికి ఎదగాలి. కళాకారులతోనే సమాజ చైతన్యం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)
: కవులు, కళాకారుల ద్వారానే సమాజ చైతన్యం సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణం లోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు పలిగిరి రాజేందర్ తను కళారంగంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా పలిగిరి పాతికెళ్ళ కళా ప్రస్థానం పేరుతో కార్యక్రమం నిర్వహించగా వందల మంది కళాకారులూ, కళాభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక కళాకారుని ప్రస్థానంలో ఇంతమంది కళాకారుల అభిమానం సంపాదించుకోవడం, కళాకారులూ అందరు ఒక్క తాటిపైకి వచ్చి రాజేందర్ ను ఆశీర్వదించడం అభినందనీయం అన్నారు.

కళాకారుల అట పాట ప్రజాప్రతినిధుల గెలుపులో సైతం ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. తెలంగాణ ఉద్యమం, సామాజిక ఉద్యమం, సామజిక చైతన్యం లో కళాకారుల పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. రాజేందర్ తో గత పదిహేనేళ్లుగా తనతో అనుబంధం ఉందని అయన ప్రతిభతోనే ఈ స్థాయికి ఎదగడం, దానివెనుక అయన కృషి , ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ అయన పట్టుదల అభినందనీయం అన్నారు. భవిష్యత్ లో పలిగిరి రాజేందర్ మరిన్ని విజయాలు సాధించాలని, మరింత ఉన్నతి, పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు.
సమాజంలో కళాకారుల పాత్ర అనిర్వచనీయం అని, మన సంస్కృతి, సంప్రదాయాలని, అంతరించిపోతున్నా కళలను భావి తరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలు మరిన్ని జరగలిసిన అవసరం ఉందన్నారు. డిసీసీ అధ్యక్షులు గజేంగి నందయ్యా మాట్లాడుతూ పలిగిరి రాజేందర్ కళా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయా సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ మాట్లాడుతూ రాజేందర్ తన శిష్యుడు అని, అయన ఇంత ఉన్నతికి ఎదిగి, ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడ అభినందనీయమని అన్నారు. ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన పలిగిరి రాజేందర్ మా ధర్మపురి నియోజకవర్గం, మండలం కు చెందిన వ్యక్తి కావడం మాకు గర్వకారణం అన్నారు. తన కళా ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించి, మరింతగా పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు.

జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడువాలా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ప్రోత్సహిస్తూదని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా జానపదం దేశ విదేశాల్లో సైతం మారుమ్రోగడం జగిత్యాల జిల్లాకే గర్వకారణం అన్నారు. ప్రముఖ గాయకుడు పలిగిరి రాజేందర్ తన కళా ప్రస్థానంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం సాధారనా విషయం కాదన్నారు. ఆ కళమ్మ తల్లీ ఆశీస్సులతో కళారంగంలో పలిగిరి రాజేందర్ మరింత ఎదగాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా పలిగిరి రాజేందర్ ను పలువురు కళాకారులూ, కళాభిమానులు, సినీ, జానపద కళాకారులూ, రాజేందర్ గురువులు, పుర ప్రముఖులు తదితరులు శాలువాలతో సత్కరించి, పుష్ప గుచ్చం అందించి, మెమొంటో లతో అభినందనలు తెలిపి ఆశీర్వాదాలు అందజేశారు.
భవిష్యత్ లో తన కళా ప్రస్థానం మరింతగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ కమిటీ సభ్యులు బోగే అశోక్,(తొలిపొద్దు)కండ్లే అంజి,గుంపుల రమేష్, కూనమల్ల సుమన్, భూక్యా గంగాధర్ నాయక్, నలువల రాము, అమ్మ మధు, చరణ్, అలుగునూరి ప్రదీప్ కుమార్, భోధనపు నటరాజ్, సీనియర్ గాయకులు రచయితలు, కలకారులు ఎస్వి మల్లిక్ తేజ,గడ్డం రమేష్, ఓరుగంటి శేఖర్, అభి, పిఎల్ రెడ్డి, ఇస్లావత్ కమల్, మహిపాల్, సతీష్, సురేష్ నాయక్, మామిడి మౌనిక, దీకొండ శిరీష, స్వరాజ్, సందీప్ రావు తదితరులున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక నూతన అధ్యక్షుడిగా దామెర సత్యనారాయణ శర్మ
హైదరాబాద్, అక్టోబర్ 25( ప్రజా మంటలు )
మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం (25 అక్టోబర్ 2026) హైదరాబాద్‌లోని రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్ సాయిబాబా దేవాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక సభ్యులు దోర్భల కృష్ణమూర్తి శర్మ , నెమ్మాని విష్ణుమూర్తి... పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)*జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రుల శంకుస్థాపన*
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా,... పాటల ప్రయాణంలో రాజేందర్ మరింత ఉన్నతికి ఎదగాలి. కళాకారులతోనే సమాజ చైతన్యం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)
: కవులు, కళాకారుల ద్వారానే సమాజ చైతన్యం సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణం లోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు పలిగిరి రాజేందర్ తను కళారంగంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా... తెలుగులో న్యాయపాలన ఎప్పుడు?
కోర్టు తీర్పులు సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులోనే వెలువరించాలి
హైదరాబాద్, అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
న్యాయస్థానాల్లో తెలుగు భాష అమలుకు చట్టాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో తెలుగు రాష్ట్రాలు విఫలమవుతున్నాయని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు మంగారి రాజేందర్ ‘జింబో’ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో... ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం: కల్వకుంట్ల కవిత
గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం
హైదరాబాద్, అక్టోబర్ 23 (ప్రజామంటలు):
ఫేక్ అగ్రిమెంట్లు, నకిలీ పెట్టుబడులతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతేడాది ప్రకటించిన రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్లో... జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు
జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు):
పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో షమీ పూజలు, జమ్మి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని, అనంతరం శ్రీమతి, శ్రీ గండ్ర రాధమ్మ రాఘవేందర్ రావు ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని... గ్రామ పంచాయతీ సిబ్బంది కి దుస్తులు పంపిణి
వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు )
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో విజయదశమి పురస్కరించుకొని గ్రామ పంచాయతి సిబ్బంది కీ సర్పంచ్ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూపల్లి రాజయ్య ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్ప... స్థంభం పల్లి లో అంగరంగ వైభవం గా అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం
వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో మంగళవారం రోజున దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది. మహిళలు మంగళ హరతులతో అమ్మ వారికీ స్వాగతం పలకడం జరిగింది. ఈ వేడుక లో మహిళలు చిన్నారులు భవాని... సామాజిక విభేదాలపై అప్రమత్తంగా ఉండాలి.. దేశంలో అస్థిరతకు తావివ్వకూడదు - మోహన్, భగవత్
పరిష్కారాల కోసమే ఉద్యమాలు జరగాలి.. జాతీయ ఐక్యత, వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం
ఉద్యమాలు రాజకీయ కక్షలకు వేదిక కాకూడదు
నాగ్‌పూర్ | అక్టోబర్ 20, 2026
దేశంలో సామాజిక విభేదాలు పెంచే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాలు... బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మండపము వద్ద ఘనంగా "చండీ హోమం "
జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం అష్టమిని పురస్కరించుకొనిజగిత్యాల బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మంటపం వద్ద అంగరంగ వైభవంగా చండీ హోమం నిర్వహించారు.
నవ చండి పారాయణాలను పూర్తి చేసి అనంతరం చండీ హోమం నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ... సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కీ అన్ని ఏర్పాట్లు పూర్తి
వెల్గటూర్ అక్టోబర్ 16 ( ప్రజా మంటలు )
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో శుక్రవారం రోజు ఉదయం వేళ లో చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ వద్ద ముళ్ళ పొదలు తొలిగించి శుభ్రం చేయడం జరిగింది. అలాగే గ్రామము లో డ్రైనేజీ తీయడం జరిగింది.. రోడ్డు కీ ఇరువైపులా ఉన్న చెత్త చెదారం... రిపోర్టర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల తొ ఎస్సై బదిలీ
సిరిసిల్ల, అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రిపోర్టర్లు శేఖర్, సంపత్‌లపై ఎస్ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ ఘటనపై జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు... 