తెలుగులో న్యాయపాలన ఎప్పుడు?

రచ్చబండ 155వ కార్యక్రమంలో విశ్రాంత జిల్లా న్యాయమూర్తి మంగారి రాజేందర్‌ ‘జింబో’

On
 తెలుగులో న్యాయపాలన ఎప్పుడు?

కోర్టు తీర్పులు సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులోనే వెలువరించాలి

హైదరాబాద్, అక్టోబర్ 25 (ప్రజా మంటలు):

న్యాయస్థానాల్లో తెలుగు భాష అమలుకు చట్టాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో తెలుగు రాష్ట్రాలు విఫలమవుతున్నాయని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు మంగారి రాజేందర్‌ ‘జింబో’ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో సాక్షుల వాంగ్మూలాలను స్థానిక భాషలో నమోదు చేయడంతోపాటు, ప్రజలకు అర్థమయ్యేలా తీర్పులను తెలుగులో వెలువరించాలని ఆయన కోరారు.

తెలుగు కూటమి అంతర్జాల వేదిక ఆధ్వర్యంలో శనివారం రాత్రి అధ్యక్షుడు కోదండ రామయ్య నేతృత్వంలో నిర్వహించిన రచ్చబండ 155వ కార్యక్రమంలో మంగారి రాజేందర్‌ పాల్గొని ప్రసంగించారు. తాను న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో ప్రజలకు అర్థమయ్యేలా తెలుగులో తీర్పులు వెలువరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.

భాషే న్యాయానికి అడ్డంకి కాకూడదు

న్యాయస్థానాల్లో తీర్పులు ఆంగ్లంలో వెలువడటం వల్ల సామాన్య ప్రజలు వాటి సారాంశాన్ని అర్థం చేసుకోలేక అయోమయానికి గురవుతున్నారని జింబో పేర్కొన్నారు. ఆంగ్లంలో తీర్పులు వెలువడటంతో ముద్దాయిలు కూడా ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. న్యాయం పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రజలకు భాష అడ్డంకిగా మారకూడదని స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థలో తెలుగు అమలు పట్ల తగిన చిత్తశుద్ధి లేకపోవడం, న్యాయమూర్తులు తెలుగులో వ్యవహరించేందుకు తగిన ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రధాన సమస్యలని విశ్లేషించారు. హైకోర్టులో ఆంగ్లంలో తీర్పులు వెలువరించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, తెలుగులో తీర్పులు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించే ఆంక్షలు లేవని అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయ భాషల్లో తీర్పులు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, అవి పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఇతర భాషలకు చెందిన న్యాయవాదులకు ఇబ్బందులు ఎదురవుతాయనే వాదనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ సహాయంతో అనువాదాలు అందించడం ద్వారా పరిష్కారం చూపవచ్చని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అధికార భాషల్లో న్యాయవ్యవస్థ కార్యకలాపాలు సాగేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదని విమర్శించారు.

తెలుగు కూటమి తీర్మానాలు

న్యాయవ్యవస్థలో తెలుగు భాష అమలుకు సంబంధించి తెలుగు కూటమి పలు తీర్మానాలు చేసింది.

  1. జీఓ నంబర్ 277ను అమలులోకి తీసుకురావాలి.
  2. దిగువ కోర్టుల తీర్పులను పూర్తిస్థాయిలో తెలుగులో అందుబాటులోకి తీసుకురావాలి.
  3. న్యాయవ్యవస్థలో తెలుగు అమలుకు హైకోర్టుపై ఒత్తిడి తీసుకురావాలి.

ఈ లక్ష్యాల సాధనకు తెలుగు కూటమి తరఫున కృషి చేయాలని కార్యక్రమంలో నిర్ణయించారు.

న్యాయశాస్త్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన జింబో

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మంగారి రాజేందర్‌ న్యాయమూర్తిగా, తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. న్యాయశాస్త్రానికి సంబంధించిన యాభైకి పైగా పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. న్యాయవ్యవస్థ, మానవ హక్కులు, ఖైదీల హక్కులు, సాక్ష్యాల చట్టం వంటి అంశాలపై రచనలు చేశారు.

ఆయన రచనలు ప్రజల్లో న్యాయవ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడ్డాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు ఉద్యమాలకు కూడా మద్దతుగా నిలిచారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి

పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి పంచాయతీ ఆధ్వర్యంలోనే పార్కింగ్ నిర్వహిస్తామని తీర్మానం
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా* జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని...
Read More...
Local News 

హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో జగిత్యాల జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు – వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. సత్యప్రసాద్

హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో జగిత్యాల జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు – వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల, నవంబర్ 03(ప్రజా మంటలు ) హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ, బాధితులకు నిరంతర వైద్య సేవలు, ఏ ఆర్ టి చికిత్స అందించడం, వైరల్ లోడ్ నియంత్రణలో జగిత్యాల జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ , తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు లభించాయి....
Read More...
Local News 

"జాతీయవాదుల సంగమం" కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు.

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం కార్యక్రమానికి జగిత్యాల పట్టణంలోని ఏబీవీపీ పూర్వ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఇటీవల కర్ణాటక రాష్ట్ర కో ఇన్చార్జిగా నియామకం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఏబివీపీ పూర్వ కార్యకర్తలు,...
Read More...
Local News 

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - 37 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన చిన్ననాటి మిత్రులు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  - 37 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన చిన్ననాటి మిత్రులు భీమదేవరపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):  మండలంలోని ముల్కనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988–89 పదో తరగతి విద్యార్థుల  ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా జరిగింది. సుమారు 37 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న బడి ఆవరణలో కలుసుకున్న చిన్ననాటి మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులంతా...
Read More...
Local News 

మంత్రి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ మహాసభ జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ మహాసభ జన్మదిన శుభాకాంక్షలు సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజా మంటలు): రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు ముదిరాజ్ మహాసభ కమ్యూనిటీ నేతలు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పాలమూరు కొదమసింహం, ముదిరాజ్ ముద్దుబిడ్డ అయిన ఆయన నిండు నూరేళ్లు...
Read More...
Local News 

ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్

ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ జగిత్యాల, నవంబర్ 01 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. దేశ ప్రజాస్వామ్య...
Read More...
Local News 

స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు..

స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు.. వెల్గటూర్ నవంబర్ 1 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కీ వచ్చే భక్తులకీ  ఉపయోగపడే  షేడ్ నిర్మాణ     పనులు ప్రారంభ దశలో నిలిచిపోవడం జరిగింది.. ఈ షేడ్ నిర్మాణం పూర్తి అయితే భక్తులకీ చాలా ఉపయోగపడుతుంది.. స్వామి దర్శనం కీ నిద్ర కీ...
Read More...
Local News 

నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సంజీవ్ నియామకం

నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సంజీవ్ నియామకం గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు  నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగలాపూర్ గ్రామానికి చెందిన రాసమల్ల సంజీవ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర అధ్యక్షులు  పసుపుకుంట్ల వికాస్ నాయీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు  సికినమెట్ల శివప్రసాద్,ప్రధాన కార్యదర్శి సురేంపల్లి గణేష్ లు సంజీవ్‌కు...
Read More...
Local News 

భీమ్ రాజు పల్లి లో భూముల రీ-సర్వే ముమ్మరం

భీమ్ రాజు పల్లి లో భూముల రీ-సర్వే ముమ్మరం గొల్లపల్లి అక్టోబర్ 29 (ప్రజా మంటలు):   మండలంలోని భీమ్రాజు పల్లిలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం, కచ్చితమైన హద్దుల గుర్తింపే లక్ష్యంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగని శ్రీలత గంగచారి, ఉప సర్పంచ్...
Read More...
Local News 

పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:

పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:   గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు  పత్తిపాక గ్రామంలోని యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరియు ట్రైనింగ్ యూత్ ఆఫీసర్ శిక్షణా పరిశీలనలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్లు (డీయోస్ ) సందర్శించారు.​ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గోలి తిరుపతి...
Read More...
Local News 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొన్న మర్రి పురురవరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొన్న మర్రి పురురవరెడ్డి సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు): బల్కంపేట 60 ఫీట్ రోడ్డు పరిధిలో బుధవారం ఉదయం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు మర్రి పురురవరెడ్డి స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు...
Read More...