జగిత్యాల మున్సిపాలిటీలో మొక్కల కొనుగోళ్లు, బయోమైనింగ్‌పై విచారణ జరపాలి - హనుమండ్ల జయశ్రే
రూ.13 లక్షల మొక్కల బిల్లులు, రూ.2.20 కోట్ల బయోమైనింగ్ పనులపై అనుమానాలు మున్సిపల్ కమిషనర్‌కు మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ఫిర్యాదు
జగిత్యాల, అక్టోబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో వనమహోత్సవం పేరుతో మొక్కల కొనుగోళ్లు, వాటి నిర్వహణ ఖర్చులు, బయోమైనింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 10న తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మొక్కల కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులను విచారణ పూర్తయ్యే వరకు నిలిపివేయాలని, ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు ప్రతులను జగిత్యాల జిల్లా కలెక్టర్, రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌కు కూడా పంపించారు.
లక్ష మొక్కల కొనుగోలుపై అభ్యంతరాలు
జగిత్యాల మున్సిపాలిటీ వనమహోత్సవంలో భాగంగా లక్ష మొక్కల కొనుగోలుకు జూలై 24, 2026న టెండర్లు పిలిచినట్లు జయశ్రీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియలో టీవీసీ నర్సరీ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్ ఒక్కటే పాల్గొని, కేవలం 1.2 శాతం తక్కువ ధరకు టెండర్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు ఉన్నాయని, ఇతర నర్సరీలు ఎందుకు పాల్గొనలేదో పరిశీలించాలని కోరారు.
జగిత్యాల పట్టణంలో ఇళ్ల సంఖ్య, మొక్కలు పెంచుకునే అవకాశాలు, గతంలో మున్సిపల్ నర్సరీల్లో పెంచిన మొక్కలను పరిగణనలోకి తీసుకోకుండా లక్ష మొక్కలు కొనుగోలు చేయడం అవసరమా అనే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని సుమారు ఐదు నర్సరీల్లో వేలాది మొక్కలు పెంచినట్లు, వాటిలో మిగిలిన మొక్కలు ఇప్పటికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ ఏడాది లక్ష మొక్కల కొనుగోలుకు టెండర్ పిలిచినప్పటికీ, కొత్తగా సుమారు 20 వేల మొక్కలు మాత్రమే తెప్పించి, మిగిలిన 80 వేల మొక్కలను పాత నర్సరీల నుంచి తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నారనే అనుమానాన్ని జయశ్రీ వ్యక్తం చేశారు. పాత మొక్కలకు సుమారు రూ.13 లక్షల బిల్లులు రూపొందించి చెల్లింపులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆరోపించారు. ఈ ఆరోపణలను అధికారికంగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించాలని కోరారు.
టెండర్ ప్రక్రియ, మొక్కల సరఫరా, నిల్వలు, పంపిణీ వివరాలపై వివరణ కోరినప్పుడు సంబంధిత అధికారులు తమకు ఈ వ్యవహారం గురించి తెలియదని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొక్కలను ఎవరు సరఫరా చేశారు, వాటి వివరాలను ఎవరు నమోదు చేశారు, బిల్లులను ఎవరు ధ్రువీకరిస్తున్నారనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
నిర్వహణ ఖర్చులు, కుండీల వినియోగంపైనా ప్రశ్నలు
జగిత్యాల మున్సిపాలిటీలో మొక్కల నిర్వహణ కోసం ఏటా సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారని జయశ్రీ ఆరోపించారు. పట్టణంలో ఉన్న చెట్ల సంఖ్యతో పోలిస్తే ఈ వ్యయంపై సమగ్ర పరిశీలన అవసరమని పేర్కొన్నారు. చెట్ల పెంపకం కోసం కొనుగోలు చేసిన కుండీలను మొక్కలు నాటేందుకు వినియోగించకుండా కొన్ని చోట్ల నిరుపయోగంగా ఉంచారని, మరికొన్ని చోట్ల అవి పగిలిపోయి కనిపిస్తున్నాయని తెలిపారు.
మొక్కల నిర్వహణకు అవసరమైన పరికరాల కొనుగోళ్లకు సంబంధించి రికార్డుల్లో చూపుతున్న ఖర్చులు, వాస్తవంగా కొనుగోలు చేసిన పరికరాలు, వాటి ప్రస్తుత నిల్వలను తనిఖీ చేయాలని కోరారు. కొనుగోళ్లు చేయకుండానే బిల్లులు చెల్లించిన సందర్భాలు ఉన్నాయనే ఆరోపణలను కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు.
రూ.2.20 కోట్ల బయోమైనింగ్ పనులపై విచారణకు డిమాండ్
జగిత్యాల మున్సిపాలిటీలో బయోమైనింగ్ పనుల నిర్వహణ, చెల్లింపులపైనా జయశ్రీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి, వ్యర్థాలను తగ్గించి పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు చేపట్టాల్సిన బయోమైనింగ్ పనులకు థర్డ్ పార్టీ సంస్థకు సుమారు రూ.2.20 కోట్లు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో ఒక విడతలో రూ.కోటి, మరో విడతలో రూ.1.20 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
అయితే, బయోమైనింగ్ పనులకు సంబంధించిన పూర్తి రికార్డులు, ఫొటోలు, వీడియోలు, వ్యర్థాలను తరలించిన వివరాలు అందుబాటులో లేవని ఆమె ఆరోపించారు. అక్కడ పనిచేసిన కార్మికులు, డ్రైవర్ల ద్వారా తనకు తెలిసిన సమాచారం ప్రకారం, చెత్తను యంత్రాలతో చదును చేసి, దానిపై మొరం పోసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. వాస్తవంగా బయోమైనింగ్ జరిగిందా? జరిగితే ఎంత పరిమాణంలో వ్యర్థాలను శుద్ధి చేశారు? మిగిలిన వ్యర్థాలను ఎక్కడికి తరలించారు? అనే అంశాలను సాంకేతికంగా పరిశీలించాలని కోరారు.
బయోమైనింగ్ పనుల కోసం చెల్లించిన మొత్తానికి సంబంధించిన కొలతల పుస్తకాలు, వర్క్ ఆర్డర్లు, బిల్లులు, చెల్లింపుల రికార్డులు, పనులు పూర్తయినట్లు ధ్రువీకరించిన నివేదికలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
బిల్లులు నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
మొక్కల కొనుగోళ్లు, నిర్వహణ ఖర్చులు, బయోమైనింగ్ పనులకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని హనుమండ్ల జయశ్రీ కోరారు. విచారణ పూర్తయ్యే వరకు మొక్కల కొనుగోళ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులను నిలిపివేయాలని, బయోమైనింగ్ పనులపై కూడా స్వతంత్ర సాంకేతిక పరిశీలన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే మున్సిపల్ నిధులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారులతో పాటు బాధ్యులైన ఇతర వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపాలిటీలో మొక్కల కొనుగోళ్లు, బయోమైనింగ్‌పై విచారణ జరపాలి - హనుమండ్ల జయశ్రే
జగిత్యాల, అక్టోబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో వనమహోత్సవం పేరుతో మొక్కల కొనుగోళ్లు, వాటి నిర్వహణ ఖర్చులు, బయోమైనింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 10న తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు... శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా... లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి
గొల్లపల్లి అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గొల్లపల్లి పోలీసులు దాడి నిర్వహించారు.
గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పోలీసులు లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు, మరికొందరు కలిసి... విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి
ఎల్కతుర్తి, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు 132/32 కేవీ భీమదేవరపల్లి సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న... జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?
జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని, వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావా వసంత సురేష్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన... ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాల అక్టోబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్ టి సి యూనియన్ ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి ,ఎస్ డబ్ల్యూ యూ, టి డబ్ల్యూయూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ లకు మద్దతుగా బాణం గుర్తుకే ఓటు... ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు : బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం
కోహెడ, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ఆలయాల అభివృద్ధి కోసం భక్తులు, దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అన్నారు. గురువారం కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి... రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
బీర్పూర్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
గోదావరి పుష్కరాల నేపథ్యంలో బీర్పూర్ మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పర్యటించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగేలా ఆశ్రమ పాఠశాలలో... రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్
ఖానాపూర్ అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘బ్లాక్ డే’
కరీంనగర్ అక్టొబర్ 08(ప్రజా మంటలు):
AICC, TPCC పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.
కార్పొరేషన్... రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా?
జగిత్యాల అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమకు కనీస వసతులు కల్పించడంలేదని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళనలో ప్రధానంగా తరగతి గదులు, మౌలిక వసతుల కొరత... బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత
ముంబాయి అక్టోబర్ 08:
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయన అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ప్రకారం నానా పటేకర్ ... 