జగిత్యాల మెడికల్ కాలేజీ .విద్యార్థుల ఆందోళన
కనీస వసతులు కల్పించాలని డిమాండ్
మౌలిక వసతుల కల్పనలో జాప్యం, ఎన్ఎంసీ నిబంధనల ఉల్లంఘనపై నిరసన
జగిత్యాల, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కొరత, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల అమలులో లోపాలను నిరసిస్తూ వైద్య విద్యార్థులు బుధవారం నుంచి నిరవధిక శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు.
విద్యార్థుల ప్రకారం.. కళాశాల శాశ్వత భవనాలు, వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగి దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా పనులు పూర్తికాలేదు. ప్రాంగణంలో రహదారులు, డ్రైనేజీ, క్రీడా సౌకర్యాలు వంటి ప్రాథమిక వసతులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని వారు పేర్కొన్నారు. 2022లో ప్రారంభమైన ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలలు ఇప్పటికే పూర్తిస్థాయి భవనాల్లోకి మారినప్పటికీ, జగిత్యాల వైద్య కళాశాల విద్యార్థులు ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లోనే విద్యను కొనసాగిస్తున్నారని తెలిపారు.
మూడు లెక్చర్ హాళ్లు.. ఐదు బ్యాచ్‌లు
కొత్త బ్యాచ్ చేరితే ఐదు బ్యాచ్‌ల విద్యార్థులు కేవలం మూడు తాత్కాలిక లెక్చర్ హాళ్లు, మూడు ప్రయోగశాలలను పంచుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఒక్కో గదిలో ఆరుగురి నుంచి ఎనిమిది మంది వరకు ఉంటున్నారని, ముఖ్యంగా విద్యార్థినులకు చదువుకునేందుకు అవసరమైన రీడింగ్ రూమ్ సౌకర్యం కూడా లేదని తెలిపారు.
కళాశాల బస్సులు లేక ఫీల్డ్ శిక్షణకు దూరం
కళాశాలకు ప్రత్యేక రవాణా సౌకర్యం లేకపోవడంతో వైద్య విద్యలో తప్పనిసరి అయిన ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ (ఎఫ్ఏపీ), గ్రామీణ/పట్టణ ఆరోగ్య శిక్షణ కేంద్రాల పోస్టింగ్‌లు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాల్లో గత మూడేళ్లుగా ఏ బ్యాచ్ విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోయారని వారు తెలిపారు. ఇది ఎన్ఎంసీ నిర్దేశించిన విద్యా ప్రమాణాలకు విరుద్ధమని విద్యార్థులు ఆరోపించారు.
డిమాండ్లు ఇవే..
తమ సమస్యలను పరిష్కరించాలని గత రెండున్నరేళ్లుగా జగిత్యాల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఆర్అండ్బీ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రధానంగా అక్టోబర్ చివరి నాటికి పూర్తయిన హాస్టళ్లను అప్పగించడం, డిసెంబర్ నాటికి శాశ్వత కళాశాల భవనాన్ని పూర్తి చేయడం, విభాగాల వారీగా పూర్తిస్థాయి ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం, వెంటనే కళాశాల బస్సులను ఏర్పాటు చేయడం, అంతర్గత రహదారులు-డ్రైనేజీ-క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
తమ ఆందోళన పూర్తిగా శాంతియుతంగా, క్రమశిక్షణతో కొనసాగుతుందని, విద్యార్థులకు హామీ ఇచ్చిన ప్రాథమిక విద్యా, వసతి సౌకర్యాలను కల్పించడమే తమ లక్ష్యమని విద్యార్థులు స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. అంజన్న నిజరూప దర్శనం చేసుకున్న స్పీకర్, మంత్రి
కొండగట్టు, నవంబర్ 20 (ప్రజామంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న అరుదైన చందనోత్సవంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ... విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలకం – మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల: నవంబర్ 20 (ప్రజా మంటలు)జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, పాటలు తదితర పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో విద్యార్థుల వ్యక్తిత్వ... మెట్పల్లి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి
జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు)మెట్‌పల్లిలోని ఇస్కాన్ ఆలయాన్ని భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామీజీలను, ఆలయ కమిటీ సభ్యులను కలిసి భగవద్గీత పుస్తకాన్ని అందుకున్నారు. ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా... నశా ముక్త్ తెలంగాణలో రెడ్‌క్రాస్ క్రియాశీలక పాత్ర పోషించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్ (లోక్ భవన్ నవంబర్- వికసిత్ భారత్ - 2047లో యువత భాగస్వామ్యం కీలకం- 68 వేల మంది కొత్త సభ్యుల చేరికపై అభినందన.. మూడు కీలక కార్యక్రమాలకు గవర్నర్ పిలుపు
మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నర్ , ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ... నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలపై జగిత్యాల ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనల ప్రకారం, జగిత్యాల పట్టణ సీఐ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మరియు సిబ్బందితో కలిసి జగిత్యాల పట్టణంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్లు... పద్మశాలి సంఘం స్వర్ణోత్సవాలకు ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఆహ్వానం
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):
గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలగందుల రమణను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు,... రాష్ట్రస్థాయి అండర్ 17 బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)ఈనెల 13 నుండి 15 వరకు కరీంనగర్ లో జరగనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక అయింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతిస్మరియ తెలిపారు
ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతిస్మరియ సిస్టర్స్ రేజిణ,లిల్లి,క్రిస్టిన,రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు... నంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడుపుతే కఠిన చర్యలు తప్పవు పట్టణ సిఐ కరుణాకర్
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)వాహనదారులు నెంబర్ ప్లేట్లు తొలగించడం రంగులు వేయడం నెంబర్ ప్లేట్లు ఉంచడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పట్టణ సిఐ కరుణాకర్ హెచ్చరించారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో డిఎస్పి సూచనలతో ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టౌన్... జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 వ జయంతి వేడుకలు _పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ప్రసూనాంబ
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)
దేశంలో విద్యాభివృద్ధికి పునాదులు వేసిన మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ అన్నారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా... పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి
పంచాయతీ ఆధ్వర్యంలోనే పార్కింగ్ నిర్వహిస్తామని తీర్మానం రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా*
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని... 