జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన. ఆరు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి.  

On

జగిత్యాల,అక్టోబర్ 2(ప్రజా మంటలు)

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు   చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి లు  డిమాండ్ చేశారు.ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల మంచినీళ్ల బావి వద్ద గల  మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

IMG-20261002-WA0133

అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏ ఓ కిషన్  కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి లు మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.

 

మీడియా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రద్దు చేసిన చట్టాల స్థానంలో జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు మీడియా కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  కోరారు. నిలిపి వేసిన రైల్వే పాసులు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

IMG-20261002-WA0210

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేసి క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించాలని టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే  రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, డిజిటల్ మీడియా కమిటీ సభ్యులు టీవీ సూర్యం, దాడుల కమిటీ సభ్యుడు ఆదిల్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల  హరికృష్ణ, అల్లే రాము, హైదర్, రమణారెడ్డి, జిల్లా కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శులు చంద్రశేఖర్, రాజకుమార్, నరేష్, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, రాయికల్, ధర్మపురి, కొడిమ్యాల, గొల్లపెల్లి, మల్యాల, సారంగాపూర్, బీర్పూర్ మండలాల ప్రెస్ క్లబ్ బాధ్యులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, శశిధర్, బూరం సంజీవ్,  అజీమ్, వినోద్, మల్లేశం, గోపి, వరప్రసాద్, గంగ మల్లయ్య, రాజకుమార్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు హరీష్, నరేష్, సాజిద్ పాషా, గౌస్, శంకర్ గౌడ్, మనోజ్, యూనియన్ సీనియర్ నాయకులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన. ఆరు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి.  

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన. ఆరు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి.   జగిత్యాల,అక్టోబర్ 2(ప్రజా మంటలు) జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు   చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి లు  డిమాండ్ చేశారు.ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల మంచినీళ్ల బావి...
Read More...
State News 

బాపూ ఘాట్‌లో గాంధీజీకి గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

బాపూ ఘాట్‌లో గాంధీజీకి గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు హైదరాబాద్, అక్టోబర్ 02 (ప్రజా మంటలు): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గాంధీజీకి నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్‌తో...
Read More...
Local News 

సిరిసిల్ల సభ విజయాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ నేతల అక్కసు

సిరిసిల్ల సభ విజయాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ నేతల అక్కసు కేటీఆర్‌కు మూడు హోటళ్లు ఎక్కడివి? సమాధానం చెప్పాలి: కొరివి అరుణ్ కుమార్
Read More...
Local News 

గాంధీ జయంతికి రక్తదాన శిబిరం

గాంధీ జయంతికి రక్తదాన శిబిరం బంజారాహిల్స్ అక్టోబర్ 02 (ప్రజా మంటలు): గాంధీ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు,...
Read More...
Local News 

పద్మారావు నగర్ లో మహాత్మా గాంధీకి ఘన నివాళి -చిన్నారులకు పండ్ల పంపిణీ

పద్మారావు నగర్ లో మహాత్మా గాంధీకి ఘన నివాళి -చిన్నారులకు పండ్ల పంపిణీ సికింద్రాబాద్, అక్టోబర్ 02 (ప్రజా మంటలు): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని పద్మారావు నగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పద్మారావు...
Read More...
Local News 

జగిత్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జగిత్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జగిత్యాల, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని పురాణిపేట, మంచినీళ్ల బావి, గాంధీనగర్ ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గజెంగి నందయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ సేవలను స్మరించుకున్నారు. సత్యం,...
Read More...
Local News 

గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి: దావ వసంత సురేష్

గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి: దావ వసంత సురేష్ జగిత్యాల, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ అహింసా మార్గంలో...
Read More...
Local News 

సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు ప్రెస్ క్లబ్ ఆర్థిక సాయం

సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు ప్రెస్ క్లబ్ ఆర్థిక సాయం జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు): కరీంనగర్‌లో వైద్య చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.57,100 ఆర్థిక సహాయాన్ని నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అవసరమని తెలిసిన వెంటనే స్పందించి, తమ వంతు సహకారం...
Read More...
Local News 

చలో సిరిసిల్ల సభ విజయవంతం చేసిన జగిత్యాల ప్రజలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ధన్యవాదాలు

చలో సిరిసిల్ల సభ విజయవంతం చేసిన జగిత్యాల ప్రజలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ధన్యవాదాలు జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ‘చలో సిరిసిల్ల’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు జగిత్యాల నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హృదయపూర్వక...
Read More...
Local News 

జగిత్యాల లలో జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన

జగిత్యాల లలో జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన జగిత్యాల, అక్టోబర్ 1 (ప్రజా మంటలు): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జగిత్యాల జిల్లా శాఖ పిలుపునిచ్చింది. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఉదయం 10.30 గంటలకు...
Read More...
Local News 

జగిత్యాల వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం.. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం

జగిత్యాల వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం.. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం జగిత్యాల, అక్టోబర్ 1 (ప్రజా మంటలు): అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివగాయత్రి వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో వైద్యులు డాక్టర్ ఇనుగుర్తి...
Read More...
National  Crime 

ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్‌పై కత్తితో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్‌పై కత్తితో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం న్యూఢిల్లీ సెప్టెంబర్ 30: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్, కెప్టెన్‌పై కత్తితో దాడి చేసినట్లు అధికారులు, ప్రయాణికుల వాంగ్మూలాల ఆధారంగా వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో విమానం ఒక్కసారిగా భారీగా ఎత్తు కోల్పోయి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది....
Read More...