సారంగాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
సారంగాపూర్ అక్టొబర్ 06 (ప్రజా మంటలు):
మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. జాగృతి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, రామాలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సారంగాపూర్, నాయకపుగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీటీఆర్‌లను ప్రారంభించారు.
మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో 13 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన రూ.13 లక్షల చెక్కులను, 28 మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.10.70 లక్షల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారులు, విద్యుత్, మహిళా సంఘాలకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను కూడా చెల్లిస్తున్నామని చెప్పారు.
రోళ్లవాగు ప్రాజెక్టుకు రూ.40 కోట్లు మంజూరు చేశామని, అటవీ అనుమతుల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. బీర్పూర్ ఘాట్ రోడ్డును డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు మంజూరు లభించిందని, అటవీ అనుమతులు రావాల్సి ఉందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
ఇటీవల కురిసిన అధిక వర్షాల నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలకు ఎవరూ అతీతులు కారని, రైతులు ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. వర్షపాతం, నీటి వనరుల పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోందన్నారు.
జగిత్యాలలో మెడికల్ కాలేజీతో పాటు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కొత్త విద్యా కోర్సులు ప్రవేశపెట్టామని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు. ఏటీసీ కేంద్రం ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
జగిత్యాల నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కొనసాగుతోందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి సారంగాపూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచులు అరుణ శేఖర్, పుష్ప నాథ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సొల్లు సురేందర్, పీఏసీఎస్ చైర్మన్లు మల్లారెడ్డి, నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ బాపిరాజు, ఎంపీడీవో సలీం, డిప్యూటీ తహసీల్దార్ సుమతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కోల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, అధికారులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సిరిసిల్లలో తప్పు కంటికి ఆపరేషన్‌పై టీజీహెచ్‌ఆర్‌సీ సుమోటో
హైదరాబాద్, అక్టోబర్ 06 (ప్రజా మంటలు): .
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వృద్ధురాలికి చేయాల్సిన కంటికి బదులుగా మరో కంటికి శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు స్వీకరించింది
సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి ఆపరేషన్ చేసినట్లు... కృష్ణశిలలతో ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించాలి.. రైతులకు నవంబర్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి
నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం: కల్వకుంట్ల కవిత
వేములవాడ, అక్టోబర్ 06 (ప్రజా మంటలు):
వేములవాడ రాజన్న ఆలయాన్ని కాంక్రీట్‌తో నిర్మించడం ద్వారా భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆలయాన్ని కృష్ణశిలలతో ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించి, వెయ్యేళ్లు నిలిచేలా తీర్చిదిద్దాలని ఆమె డిమాండ్ చేశారు.... అమరులు కలలుగన్న సమాజాన్ని నిర్మించాలి : కల్వకుంట్ల కవిత
చందుర్తి/వేములవాడ అక్టొబర్ 06 (ప్రజా మంటలు):
అమరులు ఆకాంక్షించిన సమాజాన్ని నిర్మించడమే వారికి అందించే నిజమైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. చందుర్తి మండలం సనుగులలో మంగళవారం నిర్వహించిన అమరుల యాది కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
సబ్బండ వర్గాలు, అన్ని కులాలకు అధికారంలో సముచిత భాగస్వామ్యం దక్కినప్పుడే అమరుల... సారంగాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
సారంగాపూర్ అక్టొబర్ 06 (ప్రజా మంటలు):
మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. జాగృతి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, రామాలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.... తెలంగాణలో ఏసీబీ దూకుడు.. లంచం కేసుల్లో ఉద్యోగుల అరెస్టు
హైదరాబాద్, అక్టోబర్ 6 (ప్రజా మంటలు):
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం ఆరోపణలపై వరుసగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌లో పంచాయతీ కార్యదర్శి బి.అరుణతో పాటు కాంట్రాక్ట్ కరబార్ దాసరి సంతోష్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెండు ఇళ్ల మ్యుటేషన్ దరఖాస్తు... కోరుట్ల RTA కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
జగిత్యాల అక్టొబర 06 :
కోరుట్లలోని రవాణా శాఖ (RTA) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు, లోపలికి ఎవరినీ అనుమతించకుండా సోదాలు నిర్వహించారు.
కార్యాలయంలోని పలు రికార్డులు, సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో... ప్లాస్టిక్ నోట్లకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ అక్టొబర్ 06:
06:దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగు వేసినట్లు సమాచారం. తొలిదశలో రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రయోగాత్మక ప్రక్రియను ప్రారంభించనుంది.
ఈ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు అర్హత కలిగిన... కరీంనగర్‌లో వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ అత్యాచారం
కరీంనగర్ అక్టొబర్ 06:
కరీంనగర్‌లో వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ప్రస్తుతం కరీంనగర్‌లో తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమెకు 10వ తరగతి నుంచే... ఎడమ కంటికి బదులు కుడి కంటికి సర్జరీ.. సిరిసిల్లలో కలకలం
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 5 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వారి సహకారంతొ నిర్వహించబడుతున్న కంటి ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స విషయంలో పొరపాటు జరిగిందంటూ ఓ వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపింది.
సిరిసిల్లకు చెందిన ఎంకమ్మకు ఎడమ కంటికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు ముందుగా... లంచం ఆరోపణలతో సీఐ, ఎస్సైలపై బదిలీ వేటు
కరీంనగర్, అక్టోబర్ 5 (ప్రజా మంటలు):
జేసీబీ, ట్రాక్టర్ వాహనాల విడుదలకు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌పై బదిలీ వేటు పడింది. వీరిని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
తిమ్మాపూర్‌కు చెందిన బాబు వాహనాలను... టేకు చెట్ల దొంగతనానికి పాల్పడిన నలుగురు అరెస్ట్
గొల్లపల్లి, అక్టోబర్ 5 (ప్రజా మంటలు):
టేకు చెట్లను దొంగతనంగా నరికి తరలిస్తున్న ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 132 టేకు దుంగలు, అశోక్ లేలాండ్ ఆటో, బైక్, ఎలక్ట్రిక్ రంపాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన పోనుగంటి రామారావు పొలంలోని రెండు టేకు... భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో హోటల్ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం
ఆర్ముర్ అక్టోబర్ 05 (ప్రజా మంటలు):
నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఓ చిరు హోటల్ నిర్వాహకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
భీమ్‌గల్ బస్టాండ్‌లో హోటల్ నిర్వహిస్తున్న పొలాస సుధాకర్‌ను లేట్‌నైట్ వరకు హోటల్ నడుపుతున్నారంటూ పోలీసులు పలుమార్లు ప్రశ్నించి జరిమానాలు విధించారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తనపై... 