జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలి: జీవన్‌రెడ్డి

On
జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?

జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):

విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని, వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావా వసంత సురేష్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 261 గురుకులాలు ఉండగా, తెలంగాణలో అదనంగా 652 గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జిల్లాల సంఖ్యను పెంచి వైద్య విద్యకు అవకాశాలు కల్పించారని అన్నారు.

జగిత్యాల జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయినా మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు, వసతి, ల్యాబ్ తదితర సదుపాయాలు పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. జగిత్యాలతో పాటు మంజూరైన ఏడు మెడికల్ కళాశాలల్లో మిగతా కళాశాలల భవనాలు పూర్తయి వసతులు అందుబాటులోకి వచ్చాయని, జగిత్యాల కళాశాల విషయంలో మాత్రం జాప్యం జరుగుతోందని ఆరోపించారు.

“ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదని చెప్పి పార్టీ మారారు. ఇప్పుడు అధికారంలో ఉండి మెడికల్ కళాశాల భవనాలు ఎందుకు పూర్తి చేయించలేకపోతున్నారు? డాక్టర్ అయినందుకా.. పార్టీ మారినందుకా?” అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాలలో ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

మెడికల్ కళాశాల విద్యార్థులు 24 గంటలుగా వసతుల కోసం నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించకపోవడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ తక్షణమే వారితో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మెడికల్ కళాశాలలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్ పేరుతో ఆంక్షలు విధిస్తున్నారని, కళాశాలకు వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా మంత్రి, కలెక్టర్‌పై ఉందన్నారు. డిసెంబర్‌లోగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, 2027 నూతన సంవత్సరానికి విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు.

జగిత్యాల నియోజకవర్గంలో గతంలో తాగునీటి కోసం ప్రతి మండలానికి రూ.4 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయించినట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. జగన్నాథ్‌పూర్ నుంచి బోర్నపల్లికి రూ.18 కోట్లు మంజూరు చేయించామని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో వసతుల కల్పనకు కూడా నిధుల కోసం కృషి చేశామని చెప్పారు. ప్రస్తుతం జగిత్యాలలో జరుగుతున్న పలు పనులు కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు.

మెడికల్ కళాశాల విద్యార్థుల ఆందోళనకు బీఆర్‌ఎస్ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నామని, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించకపోతే పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు చేపడతామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, అయిల్నేని వెంకటేశ్వరరావు, మున్నా, వొళ్లం మల్లేశం, పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, శీలం ప్రవీణ్, దేవేందర్ నాయక్, రాగుల ప్రదీప్, తాటిపర్తి దేవేందర్‌రెడ్డి, కళ్లేపల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, ధర రమేష్‌బాబు, నక్క జీవన్, శీలం సురేందర్, ప్రవీణ్‌కుమార్, గాజుల శ్రీనివాస్, ప్రణయ్, వెంకట్‌రెడ్డి, అభి, మామిడిపల్లి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

Local News 

పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి

పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి పంచాయతీ ఆధ్వర్యంలోనే పార్కింగ్ నిర్వహిస్తామని తీర్మానం
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా* జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని...
Read More...
Local News 

హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో జగిత్యాల జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు – వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. సత్యప్రసాద్

హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో జగిత్యాల జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు – వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల, నవంబర్ 03(ప్రజా మంటలు ) హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ, బాధితులకు నిరంతర వైద్య సేవలు, ఏ ఆర్ టి చికిత్స అందించడం, వైరల్ లోడ్ నియంత్రణలో జగిత్యాల జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ , తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు లభించాయి....
Read More...
Local News 

"జాతీయవాదుల సంగమం" కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు.

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం కార్యక్రమానికి జగిత్యాల పట్టణంలోని ఏబీవీపీ పూర్వ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఇటీవల కర్ణాటక రాష్ట్ర కో ఇన్చార్జిగా నియామకం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఏబివీపీ పూర్వ కార్యకర్తలు,...
Read More...
Local News 

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - 37 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన చిన్ననాటి మిత్రులు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  - 37 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన చిన్ననాటి మిత్రులు భీమదేవరపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):  మండలంలోని ముల్కనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988–89 పదో తరగతి విద్యార్థుల  ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా జరిగింది. సుమారు 37 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న బడి ఆవరణలో కలుసుకున్న చిన్ననాటి మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులంతా...
Read More...
Local News 

మంత్రి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ మహాసభ జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ మహాసభ జన్మదిన శుభాకాంక్షలు సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజా మంటలు): రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు ముదిరాజ్ మహాసభ కమ్యూనిటీ నేతలు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పాలమూరు కొదమసింహం, ముదిరాజ్ ముద్దుబిడ్డ అయిన ఆయన నిండు నూరేళ్లు...
Read More...
Local News 

ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్

ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ జగిత్యాల, నవంబర్ 01 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. దేశ ప్రజాస్వామ్య...
Read More...
Local News 

స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు..

స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు.. వెల్గటూర్ నవంబర్ 1 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కీ వచ్చే భక్తులకీ  ఉపయోగపడే  షేడ్ నిర్మాణ     పనులు ప్రారంభ దశలో నిలిచిపోవడం జరిగింది.. ఈ షేడ్ నిర్మాణం పూర్తి అయితే భక్తులకీ చాలా ఉపయోగపడుతుంది.. స్వామి దర్శనం కీ నిద్ర కీ...
Read More...
Local News 

నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సంజీవ్ నియామకం

నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సంజీవ్ నియామకం గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు  నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగలాపూర్ గ్రామానికి చెందిన రాసమల్ల సంజీవ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర అధ్యక్షులు  పసుపుకుంట్ల వికాస్ నాయీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు  సికినమెట్ల శివప్రసాద్,ప్రధాన కార్యదర్శి సురేంపల్లి గణేష్ లు సంజీవ్‌కు...
Read More...
Local News 

భీమ్ రాజు పల్లి లో భూముల రీ-సర్వే ముమ్మరం

భీమ్ రాజు పల్లి లో భూముల రీ-సర్వే ముమ్మరం గొల్లపల్లి అక్టోబర్ 29 (ప్రజా మంటలు):   మండలంలోని భీమ్రాజు పల్లిలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం, కచ్చితమైన హద్దుల గుర్తింపే లక్ష్యంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగని శ్రీలత గంగచారి, ఉప సర్పంచ్...
Read More...
Local News 

పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:

పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:   గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు  పత్తిపాక గ్రామంలోని యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరియు ట్రైనింగ్ యూత్ ఆఫీసర్ శిక్షణా పరిశీలనలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్లు (డీయోస్ ) సందర్శించారు.​ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గోలి తిరుపతి...
Read More...
Local News 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొన్న మర్రి పురురవరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొన్న మర్రి పురురవరెడ్డి సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు): బల్కంపేట 60 ఫీట్ రోడ్డు పరిధిలో బుధవారం ఉదయం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు మర్రి పురురవరెడ్డి స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు...
Read More...