సిరిసిల్లలో తప్పు కంటికి ఆపరేషన్‌పై టీజీహెచ్ఆర్సీ సుమోటో
12 ఏళ్లుగా పెన్షన్ బకాయిలా? మూడు వారాల్లో చెల్లించాలి: టీజీహెచ్ఆర్సీ
హైదరాబాద్, అక్టోబర్ 06 (ప్రజా మంటలు): .
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వృద్ధురాలికి చేయాల్సిన కంటికి బదులుగా మరో కంటికి శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సుమోటోగా కేసు స్వీకరించింది
సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి ఆపరేషన్ చేసినట్లు వచ్చిన కథనాలపై స్పందించిన కమిషన్.. ఆరోపణలు నిజమైతే వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత, శస్త్రచికిత్సకు ముందు పొందిన సమ్మతి వంటి అంశాలపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతాయని పేర్కొంది.
ఈ ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా DM&HO నుంచి సమగ్ర నివేదిక కోరింది. వైద్య రికార్డులు, చేయాల్సిన మరియు చేసిన శస్త్రచికిత్స వివరాలు, రోగి లేదా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న సమ్మతి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఘటనపై నిర్వహించిన విచారణ వివరాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది.
ఈ కేసును నవంబర్ 6న ఉదయం 11 గంటలకు విచారణకు ఉంచింది.
12 ఏళ్లుగా పెన్షన్ బకాయిలా? మూడు వారాల్లో చెల్లించాలి: టీజీహెచ్ఆర్సీ
హైదరాబాద్: NIMSలో అనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంత శ్రీనివాస్‌కు దాదాపు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
డాక్టర్ శ్రీనివాస్ 2014 నవంబర్ 13న VRS తీసుకున్నారని, పెన్షన్ ప్రయోజనాలు విడుదల చేయాలని ప్రభుత్వం 2023 అక్టోబర్‌లోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని కమిషన్ పేర్కొంది.
పెన్షన్ ఉద్యోగి సేవల ద్వారా సంపాదించుకున్న హక్కు అని, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవనానికి అది అవసరమని స్పష్టం చేసింది. ఇంతకాలం పెన్షన్ ప్రయోజనాలను పెండింగ్‌లో ఉంచడంపై NIMS అధికారుల తీరును తప్పుబట్టింది.
మూడు వారాల్లోగా డాక్టర్ శ్రీనివాస్‌కు రావాల్సిన మొత్తం పెన్షన్ ప్రయోజనాలను విడుదల చేసేలా NIMS డైరెక్టర్ వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నివేదికను కమిషన్‌కు సమర్పించాలని సూచించింది.
గడువులోగా ఆదేశాలను అమలు చేయకపోతే NIMS డైరెక్టర్ స్వయంగా కమిషన్ ఎదుట హాజరై, ఆలస్యానికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. అంజన్న నిజరూప దర్శనం చేసుకున్న స్పీకర్, మంత్రి
కొండగట్టు, నవంబర్ 20 (ప్రజామంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న అరుదైన చందనోత్సవంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ... విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలకం – మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల: నవంబర్ 20 (ప్రజా మంటలు)జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, పాటలు తదితర పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో విద్యార్థుల వ్యక్తిత్వ... మెట్పల్లి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి
జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు)మెట్‌పల్లిలోని ఇస్కాన్ ఆలయాన్ని భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామీజీలను, ఆలయ కమిటీ సభ్యులను కలిసి భగవద్గీత పుస్తకాన్ని అందుకున్నారు. ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా... నశా ముక్త్ తెలంగాణలో రెడ్‌క్రాస్ క్రియాశీలక పాత్ర పోషించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్ (లోక్ భవన్ నవంబర్- వికసిత్ భారత్ - 2047లో యువత భాగస్వామ్యం కీలకం- 68 వేల మంది కొత్త సభ్యుల చేరికపై అభినందన.. మూడు కీలక కార్యక్రమాలకు గవర్నర్ పిలుపు
మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నర్ , ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ... నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలపై జగిత్యాల ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనల ప్రకారం, జగిత్యాల పట్టణ సీఐ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మరియు సిబ్బందితో కలిసి జగిత్యాల పట్టణంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్లు... పద్మశాలి సంఘం స్వర్ణోత్సవాలకు ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఆహ్వానం
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):
గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలగందుల రమణను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు,... రాష్ట్రస్థాయి అండర్ 17 బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)ఈనెల 13 నుండి 15 వరకు కరీంనగర్ లో జరగనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక అయింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతిస్మరియ తెలిపారు
ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్యోతిస్మరియ సిస్టర్స్ రేజిణ,లిల్లి,క్రిస్టిన,రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు... నంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడుపుతే కఠిన చర్యలు తప్పవు పట్టణ సిఐ కరుణాకర్
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)వాహనదారులు నెంబర్ ప్లేట్లు తొలగించడం రంగులు వేయడం నెంబర్ ప్లేట్లు ఉంచడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పట్టణ సిఐ కరుణాకర్ హెచ్చరించారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో డిఎస్పి సూచనలతో ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టౌన్... జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 వ జయంతి వేడుకలు _పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ప్రసూనాంబ
జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)
దేశంలో విద్యాభివృద్ధికి పునాదులు వేసిన మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ అన్నారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా... పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుండి మినహాయించాలి
పంచాయతీ ఆధ్వర్యంలోనే పార్కింగ్ నిర్వహిస్తామని తీర్మానం రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా*
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని... 