పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)
*జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రుల శంకుస్థాపన*
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ఆదివారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.
*మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,* తన రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైందని తెలిపారు. పేద ప్రజలకు అందించగలిగే అత్యంత విలువైన సంపద విద్యేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన కులగణనలోనూ విద్య ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న విషయం స్పష్టమైందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగారని, గురుకుల విద్యాసంస్థల్లో చదువుకున్న ఎంతోమంది నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రంలోని 326 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో కేవలం 26 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని తెలిపారు.

*మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,* రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో విద్యారంగానికి భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారని తెలిపారు.
జగిత్యాలలో ఇటీవల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తాటిపల్లిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గతంలో గురుకులాలకు సొంత భవనాలు, నాణ్యమైన ఆహారం వంటి సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొంటూ, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పిస్తోందన్నారు.
డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీల పెంపుతో పాటు నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్నట్లు తెలిపారు.
*ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,* ఇందిరమ్మ రాజ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
తాటిపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2,600 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
*జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ,* తాటిపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 2,600 మంది విద్యార్థులకు విద్యనందించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
నిర్మాణ పనులను 18 నెలల్లో పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాలో విద్యారంగ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

*జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,* జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
విద్య ద్వారానే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, తెలంగాణ రైజింగ్ విధానం ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 2,600 మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో ఆధునిక తరగతి గదులు, క్రీడా మైదానాలు, గ్రంథాలయం తదితర సదుపాయాలతో విద్యనభ్యసించే అవకాశం కలుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసన్నాంబ, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు,నారాయణ రెడ్డి , సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక నూతన అధ్యక్షుడిగా దామెర సత్యనారాయణ శర్మ
హైదరాబాద్, అక్టోబర్ 25( ప్రజా మంటలు )
మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం (25 అక్టోబర్ 2026) హైదరాబాద్‌లోని రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్ సాయిబాబా దేవాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక సభ్యులు దోర్భల కృష్ణమూర్తి శర్మ , నెమ్మాని విష్ణుమూర్తి... పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)*జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రుల శంకుస్థాపన*
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా,... పాటల ప్రయాణంలో రాజేందర్ మరింత ఉన్నతికి ఎదగాలి. కళాకారులతోనే సమాజ చైతన్యం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)
: కవులు, కళాకారుల ద్వారానే సమాజ చైతన్యం సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణం లోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు పలిగిరి రాజేందర్ తను కళారంగంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా... తెలుగులో న్యాయపాలన ఎప్పుడు?
కోర్టు తీర్పులు సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులోనే వెలువరించాలి
హైదరాబాద్, అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
న్యాయస్థానాల్లో తెలుగు భాష అమలుకు చట్టాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో తెలుగు రాష్ట్రాలు విఫలమవుతున్నాయని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు మంగారి రాజేందర్ ‘జింబో’ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో... ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం: కల్వకుంట్ల కవిత
గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం
హైదరాబాద్, అక్టోబర్ 23 (ప్రజామంటలు):
ఫేక్ అగ్రిమెంట్లు, నకిలీ పెట్టుబడులతో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతేడాది ప్రకటించిన రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్‌లో... జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు
జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు):
పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో షమీ పూజలు, జమ్మి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని, అనంతరం శ్రీమతి, శ్రీ గండ్ర రాధమ్మ రాఘవేందర్ రావు ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని... గ్రామ పంచాయతీ సిబ్బంది కి దుస్తులు పంపిణి
వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు )
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో విజయదశమి పురస్కరించుకొని గ్రామ పంచాయతి సిబ్బంది కీ సర్పంచ్ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూపల్లి రాజయ్య ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్ప... స్థంభం పల్లి లో అంగరంగ వైభవం గా అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం
వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో మంగళవారం రోజున దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది. మహిళలు మంగళ హరతులతో అమ్మ వారికీ స్వాగతం పలకడం జరిగింది. ఈ వేడుక లో మహిళలు చిన్నారులు భవాని... సామాజిక విభేదాలపై అప్రమత్తంగా ఉండాలి.. దేశంలో అస్థిరతకు తావివ్వకూడదు - మోహన్, భగవత్
పరిష్కారాల కోసమే ఉద్యమాలు జరగాలి.. జాతీయ ఐక్యత, వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం
ఉద్యమాలు రాజకీయ కక్షలకు వేదిక కాకూడదు
నాగ్‌పూర్ | అక్టోబర్ 20, 2026
దేశంలో సామాజిక విభేదాలు పెంచే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాలు... బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మండపము వద్ద ఘనంగా "చండీ హోమం "
జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం అష్టమిని పురస్కరించుకొనిజగిత్యాల బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మంటపం వద్ద అంగరంగ వైభవంగా చండీ హోమం నిర్వహించారు.
నవ చండి పారాయణాలను పూర్తి చేసి అనంతరం చండీ హోమం నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ... సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కీ అన్ని ఏర్పాట్లు పూర్తి
వెల్గటూర్ అక్టోబర్ 16 ( ప్రజా మంటలు )
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో శుక్రవారం రోజు ఉదయం వేళ లో చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ వద్ద ముళ్ళ పొదలు తొలిగించి శుభ్రం చేయడం జరిగింది. అలాగే గ్రామము లో డ్రైనేజీ తీయడం జరిగింది.. రోడ్డు కీ ఇరువైపులా ఉన్న చెత్త చెదారం... రిపోర్టర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల తొ ఎస్సై బదిలీ
సిరిసిల్ల, అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రిపోర్టర్లు శేఖర్, సంపత్‌లపై ఎస్‌ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ ఘటనపై జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు... 