అమెరికాలోని ఫ్రీమాంట్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 30 (ప్రజామంటలు) :
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎప్–యూఎస్ఏ) ఆధ్వర్యంలో మంగళవారం అమెరికా లోని కాలిఫోర్నియా స్టేట్ ఫ్రీమాంట్ నగరంలోని లేక్ ఎలిజబెత్ సెంట్రల్ పార్క్ లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది తెలంగాణ ఎన్నారై వనితలు, కుటుంబ సభ్యులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాల మద్య బతుకమ్మలు ఆడారు. మహిళలు అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేశారు. సముద్రా సిల్క్స్ తరఫున అత్యుత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు.
ముఖ్య అతిథులుగా టిడిఎఫ్ ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజా రెడ్డి వట్టే పాల్గొన్నారు. నిర్వాహకులు స్రవంతి కరకాల, పల్లవి ముసుకుల, సింధి మేకల, సంధ్య నలమచ్చు , సమత వట్టిపెల్లి,లావన్య గూడూరు,అనుపమ, ప్రీతీ అనంతుని, ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ, వచ్చిన అతిథులకు,స్పాన్సర్స్ దోశ ప్యాలెస్,సముద్రా సిల్క్స్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
