పదవి విరమణ పొందిన ఏ ఎస్ ఐ మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు)
పోలీస్ శాఖలో 41 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏ ఎస్ ఐ మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. సుమారు 41 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఏ.ఎస్.ఐ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అన్నారు. పదవీవిరమణ చేసిన మీరు కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు అని కొనియాడారు.
అనంతరం పదవి విరమణ పొందిన ఏ ఎస్ ఐ మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ ని పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలోన ఎస్బి డిఎస్పి వెంకట రమణ, ఎస్ బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్.ఐ కిరణ్ కుమార్ , ఎస్సైలు సతీష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
