అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం
జెలెన్స్కి - పుతిన్ ల సమావేశం ?
ఇక జెలెన్స్కి చేతుల్లోనే....ట్రంప్
నిర్మాణాత్మక సమావేశం - పుతిన్
అలాస్కా ఆగస్ట్ 16:
అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. దాదాపు 3 గంటలకు పాటు సమావేశం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి.
ట్రంప్-పుతిన్ అలాస్కా శిఖరాగ్ర సమావేశం ముఖ్యాంశాలు: ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించడంపై వ్లాదిమిర్ పుతిన్‌తో ఎటువంటి ఒప్పందం లేదని డోనాల్డ్ ట్రంప్ అన్నారు
రష్యా పుతిన్‌తో విస్తృత స్థాయిలో ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రశంసించారు, కానీ అద్భుతమైన స్నేహపూర్వక సమావేశం ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఎటువంటి ప్రత్యేకతలు ఇవ్వలేదు.
జెలెన్స్కి చేతుల్లోనే....ట్రంప్
అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, సమావేశం ఫలప్రదమైందని పేర్కొన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు.
డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి సియాన్ హానిటీతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయనకు సూచిస్తానని చెప్పారు.
జెలెన్స్కి - పుతిన్ ల సమావేశం ?
“ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉంది” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
పుతిన్ తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు.
అంతకుముందు పుతిన్ మాట్లాడుతూ.. జెలెన్స్కీతో భేటీ అయ్యేందుకు వ్యతిరేకం కాదని, కొన్ని షరతులకు తప్పనిసరిగా అంగీకరించాలన్నారు.సంతకాలు చేయడానికి శాంతి ఒప్పందం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే భేటీ ఉంటుందని క్రెమ్లిన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలన పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు.
త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. మళ్లీ పుతినన్ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.
నిర్మాణాత్మక సమావేశం - పుతిన్
పుతిన్ మాట్లాడుతూ.. అలాస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పోలీసు అధికారులు

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మర్రి పురూరవరెడ్డి

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం
.jpeg)
పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి

150 కోట్ల వసూలు చేసిన "రజనీకాంత్ - నాగార్జున" ల కికూలి:
.jpeg)
మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం
.jpg)
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా.
