పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)
ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయిన పోలీస్ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పి
విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన స్పెషల్ బ్రాంచ్ ASI రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్ స్టేషన్లో ASI గా విదులు నిర్వహిస్తున్న రుద్ర కృష్ణకుమార్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 11 మంది పోలీస్ అధికారులకు ఇండియన్ పోలీస్ మెడల్ రాగా జిల్లా నుండి ఇద్దరు పోలీసు అధికారులు ఎంపిక కావడం అభినందనీయ విషయమని అన్నారు.
రాజేశుని శ్రీనివాస్ 1989 లో కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరి 2012 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి మరియు 2019 లో ASI గా పదోన్నతి పొందినారు. 2012 సంవత్సరంలో రాష్ట్ర పోలీసు సేవా పథకంకు మరియు 2019 లో ఉత్తమ సేవా పథకం కు ఎంపిక కావడం జరిగింది. 36 సంవత్సరాలు గా ఎలాంటి రిమార్క్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక కావడం జరిగింది.
రుద్ర కృష్ణ కుమార్ 1989 లో కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరి 2017 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి మరియు 2021 లో ASI గా పదోన్నతి పొందినారు. 2022 సంవత్సరంలో రాష్ట్ర పోలీసు సేవా పథకం కు ఎంపిక కావడం జరిగింది. 36 సంవత్సరాలు గా ఎలాంటి రిమార్క్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక కావడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
శాతవాహన స్కూల్ లో జండపండుగ

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,
