గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
(అంకం భూమయ్య):
గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల యువకులు గతకొంతకాలంగా క్రీడా మైదానానికి స్థలం లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందిస్తూ, రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్‌లతో చర్చించి, క్రీడా మైదాన నిర్మాణం కోసం ఏడు ఎకరాల భూమిని కేటాయించారు. ప్రొసీడింగ్ పత్రాలను యువకులకు ఇటీవలే అందజేశారు.
బుధవారం క్రీడా మైదానానికి సంబంధించిన నిర్మాణ పనులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభ ఉంది. వారికి సరైన వేదికలు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ మైదానం ఏర్పాటు జరుగుతోంది. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమసంతోష్ , వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, తాసిల్దార్ మమ్మద్ అబ్దుల్ మజీద్, ఆర్ ఐ అనూష,మండల అధికారులు నాయకులు గురుజల బుచ్చిరెడ్డి, రాపల్లి గంగన్న,చెవుల మద్ది వినోద్, అంకం గణేష్ , క్రీడాకారులు యువకులు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నరు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
